కొత్త 2000, 200నోట్లపై మరో పిడుగు లాంటి వార్త ! జాగ్రత్తగా లేకపోతే ఇక అంతే..!    2018-06-20   22:19:41  IST  Raghu V

అనుకోకుండా ఒకోసారి మన దగ్గర ఉన్న డబ్బు నోట్ల చినిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సాధారణంగా బ్యాంకు కి వెళ్లి మార్చుకుంటాము. కానీ పెద్ద నోట్ల విషయంలో అలా కుదరదు అంట. నోటు చిరిగింది అంటే..ఇక డబ్బులు పోయినట్టే లెక్క. రూ.200 నోటు విషయంలోనూ అదే పరిస్థితి

బ్యాంకులు కాకుండా ప్రైవేట్‌ వ్యక్తులు కూడా చిరిగిన నోట్లకు బదులుగా మంచి నోట్ల ఇస్తుంటారు. కాకపోతే కొంచెం కమీషన్‌ తీసుకుంటారు. అయితే పాత రూ.500, రూ.వెయ్యి నోట్ల రద్దు తర్వాత అందుబాటులోకి రూ.2000 నోటు వచ్చింది. కొత్త భద్రలతో ఈ నోటు వచ్చి ఏడాదిన్నరకు పైగా అవడంతో ఇది కూడా పాతబడింది. ఇదే సమయంలో కొన్నిసార్లు అనుకోకుండా చిరిగిపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు అక్కడే వచ్చింది అసలు చిక్కంతా. వినియోగదారులు చిరిగిపోయిన, లేదా పాడైన రూ.2000 నోటును బ్యాంకుకు తీసుకెళ్తే.. చాలావరకు బ్యాంకులు తీసుకోవడం లేదు. దానికి సరిపడా నోటును లేదా నోట్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.