What to do if $ex (penetration) becomes difficult ?     2018-03-19   04:08:20  IST  Raghu V

What to do if $ex (penetration) becomes difficult ?

శృంగార జీవితంలో అసలైన ఆట మొదలయ్యేది అంగప్రవేశం జరిగాకే. ఆ తరువాత జరిగే చర్యనే ఆంగ్లంలో Penetration అని అంటారు. 90% భాగస్వాములు శృంగారం సమస్యలు ఎదుర్కొనేది ఇక్కడే. అంగస్తంభన అనేది మగవారి సమస్య అయితే, అంగప్రవేశం సరిగా జరక్కపోవడం స్త్రీల సమస్య. అంగప్రవేశం జరగకపోవడానికి చాలా కారణాలుంటాయి. అవేంటో తరువాత చూద్దాం కాని, అంగం ప్రవేశండంలో సమస్యలుంటే మాత్రం అది ఆడవారికి నరకంగా కనబడుతుంది. అర్థం చేసుకునే భర్త ఉంటే తన సమస్యని పరిష్కరించి, తనకి సహాయం చేసి, సొంతంగా శృంగార జీవితాన్ని మెరుగుపరుచుకుంటాడు. లేదంటే, రఫ్ శృంగారం వలన స్త్రీ తీవ్రమైన నొప్పిని ఎదుర్కుంటుంది. అదే జరిగితే ఆమెకి శృంగారం మీద అనాసక్తి పెరగవచ్చు, శృంగారం లైఫ్ కి పూర్తిగా దూరంగా ఉండాలి అనేంతగా భయం పుట్టవచ్చు. శృంగారం అంటేనే నొప్పి, అందులో హాయి కాని సుఖం కాని లేనే లేవు అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. ఇది చాలా తీవ్రమైన సమస్య .. ప్రపంచవ్యాప్తంగా వేలమంది స్త్రీలు దీనితో బాధపడుతున్నారు. వీరికి బేసిగ్ గా శృంగారం మీద ఆసక్తి లేక కాదు .. కొన్ని కారణాల మీద శృంగారం మీద భయం పుట్టవచ్చు, అందుకే అంగప్రవేశం కష్టమైపోతుంది .. అలాగే మరికొన్ని కారణాల వలన శృంగారం అంటే భయం లేని స్త్రీలలో కూడా అంగప్రవేశం కష్టం అవుతుంది. మరి ఆ కారణాలు ఏంటో, ఈ సమస్యకి పరిష్కార మార్గాలు ఏంటో ఓసారి చూడండి.

* మొదటిరాత్రి భయం – ఇద్దరు మాట్లాడుకోండి.

మొదటిరాత్రి రోజు ఇటు స్త్రీలలో, అటు పురుషులలో ఒకలాంటి భయం ఉంటుంది. దానికి కారణం భాగస్వామితో పెద్దగా పరిచయం లేకపోవడం కావచ్చు. సరైన పరిచయం లేని వ్యక్తీ ముందు నగ్నంగా ఎలా ఉండాలి, ఎలా శృంగారం చేయాలి, తప్పులు చేస్తామేమో, మన శరీరాన్ని చూసి వారు ఏమనుకుంటారో .. ఇలాంటి భయలెన్నో ఉంటాయి. ఈ భయం, ఆందోళన వలన పురుషులకి అంగస్తంభన, శీఘ్రస్కలనం వంటి సమస్యలు వస్తే, స్త్రీలలో అంగప్రవేశం కష్టమైపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే యోని నరాలు భయం వలన బిగుసుకుపోవడం వలన. యోని వదులుగా మారి, అంగప్రవేశం ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలంటే మొదట ఆమె భయాన్ని పోగొట్టాలి. ఇద్దరు భాగస్వాములు డైరెక్ట్ గా పని మొదలుపెట్టకుండా, కాసేపు ఒకరిని ఒకరు తెలుసుకోవాలి. అప్పుడే మొహమాటం, భయం తగ్గుతాయి. అందుకే పెళ్ళికి ముందే క్లోజ్ అయిపోవడం మంచిది. ప్రేమ వివాహాలు చేసుకున్నవారికి ఇన్ని కష్టాలు ఉండకపోవచ్చు. ఇక మరొక విషయం ఏమిటంటే, చిన్నప్పుడు కాని, పెద్దయ్యాక కాని, ఆమే లైంగిక వేధింపులకి గురి అయ్యుంటే కూడా ఇలాంటి భయాలు ఉంటాయి .. అలాంటిదే జరిగి ఉంటే, ఆమే చేయని తప్పు గురించి బాధపడాల్సిన అవసరం కాని, భయపడాల్సిన అక్కెర కాని లేదని, ఆమెకు మీరు సపోర్ట్ గా ఉంటున్నట్లు తెలపాలి.

* లుబ్రికేషన్ సరిగా లేకపోవడం

స్త్రీలలో కామోద్రేకం కలగగానే ఓకే ద్రవపదార్థం యోనిలో పుడుతుంది. దీన్నే లూబ్రికేషన్ అని అంటారు. ఇది యోని గోడలని స్మూత్ గా ఉంచి, అంగప్రవేశాన్ని సులువుగా మారుస్తుంది. అందుకే ఆమె కామోద్రేకంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదు అంగప్రవేశంలో. కామోద్రేకంలో ఉన్నప్పుడు రఫ్ శృంగారం ని కూడా ఇష్టపడతారు, కోరుకుంటారు అమ్మాయిలు. కాని లుబ్రికేషన్ సరిగా లేకపోతే మాత్రం అంగప్రవేశం జరగడం కూడా కష్టమే. కాబట్టి లుబ్రికేషన్ బాగా జరగాలి. లుబ్రికేషన్ లేనిది శృంగారం మొదలుపెట్టకూడదు. మార్కెట్లో లుబ్రికేషన్ కోసం రకరకాల ప్రాడక్ట్స్ దొరుకుతాయి. కాని వీటిని వాడేముందు ఏ ప్రాడక్టు వాడాలో, అసలు మార్కెట్లో ఉన్న లుబ్రికేషన్ ప్రాడక్టులు వాడాలో వద్దో ఓసారి డాక్టర్ ని అడగాలి. సహజంగా అయితే, మెనోపాజ్ కి ముందు, మెనోపాజ్ తరువాత, డెలివరి జరిగన తరువాత కొన్నిరోజుల తరువాత లుబ్రికేషన్ జరగడం కష్టం అవుతుంది. ఇలాంటి సమయాల్లో స్త్రీ శరీరాన్ని అర్థం చేసుకోవాలి మగవారు.