What to do at home if you suffer high BP

హైబిపి సమస్య చాలామందికి ఉంటుంది. లెక్కపెట్టాలే గాని, ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు. వీరికి కోపతాపాలు ఎక్కువ, బాగా ఎమోషనల్ .. ఎందుకంటే రక్తం అవసరానికి మించిన వేగంతో పరిగెడుతోంది. అందుకే దీన్ని హై బ్లడ్ ప్రెషర్ అని అంటారు. మరి ఈ సమస్యకి చికిత్స కేవలం బీపీ గోలీలు మింగడమేనా? ఇంట్లో మనవంతుగా ఎలాంటి జాగ్రత్తలు చికిత్సలు వద్దా?ఉన్నాయండి .. మీరు పాటించండి చాలు.

* మన భారతీయులకి ఉప్పు తినే అలవాటు ఎక్కువ. చప్పటి కూడుని తినడం కూడా అవమానకరంగా భావిస్తారు. ఉప్పు కారం తక్కువ తిన్నవారిని వెక్కిరిస్తారు. ఉప్పు తినకూడదని కాదు, కాని ఎంత? లిమిట్ లో తినకపోతే ఎలా? పచ్చళ్ళు అని, పిండివంటలు అని అవసరానికి మించిన ఉప్పు తినేస్తాం. దీంతో సోడియం లెవెల్స్ పెరిగిపోయి హై బ్లడ్ ప్రెషర్ మొదలవుతుంది. కాబట్ట సాధ్యమైనంతవరకు ఉప్పు తక్కువ తినండి.

* ఇంతకుముందే తిండి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మంచి తిండి చాలా అవసరం. ఫ్యాట్స్ ఎక్కువగా లేని ఆహారాలు, సోడియం ఎక్కువగా లేని ఆహారాల మీద దృష్టి కేంద్రీకరించండి. ఒకవేళ సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటే, పొటాషియం ఎక్కువ ఉండే ఆహారంతో బ్యాలెన్స్ చేయండి. అరటిపండులో పొటాషియం బాగా ఉంటుంది.