అసలు టి.ఆర్.ఫై రేటింగ్ అంటే ఏంటి? అది ఎలా ఇస్తారు.?     2018-06-22   03:30:52  IST  Raghu V

బిగ్ బాస్ 2 టి.ఆర్.ఫై రేటింగ్ ఇటీవలే విడుదలయ్యింది. తొలివారం 16 రేటింగ్ ఉంది. బిగ్ బాస్ 1 తో పోలిస్తే ఇది తక్కువే. ఈ రేటింగ్ ని బట్టి ఎంత మంది షో చూస్తున్నారో చెప్పొచ్చు అంటారు. అసలు ఈ రేటింగ్ ఎలా ఇస్తారు.? అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఇంకెందుకు లేట్ తెలుసుకుందాం రండి.

బార్క్‌ రేటింగ్స్‌ అనే విషయాన్ని మరో మాటలో చెప్పాలంటే టీఆర్‌పీ రేటింగ్‌ అని అనవచ్చు. అంటే టీఆర్‌పీ రేటింగ్‌ ఎంత ఎక్కువ ఉంటే టీవీ చానల్స్‌కు ఆయా ప్రోగ్రామ్‌లకు వచ్చే యాడ్స్‌ అన్ని ఎక్కువగా ఉంటాయన్నమాట. దీంతో చానల్స్‌కు కూడా ఆదాయం వస్తుంది. టీఆర్‌పీ రేటింగ్స్‌ను బట్టి వాళ్లు యాడ్‌ రేట్లను ఫిక్స్‌ చేస్తారు. నిర్దిష్టమైన ప్రోగ్రామ్‌కు టీఆర్‌పీ రేటింగ్‌ ఎక్కువ వస్తుంది అనుకోండి.. దానికి ఆ చానల్‌ వారు యాడ్స్‌ను ప్రదర్శించినందుకు ఎక్కువ మొత్తం డబ్బు వసూలు చేస్తారన్నమాట. అందుకు అనుగుణంగానే ప్రోగ్రామ్‌లకు వచ్చే టీఆర్‌పీ రేటింగ్స్‌ను బట్టి యాడ్‌ రేట్లను నిర్ణయిస్తారు. దాంతో టీవీ చానల్స్‌ వారికి ఆ యాడ్స్‌ ద్వారా ఆదాయం వస్తుంది. అయితే అంతా బాగానే ఉంది.. ఈ రేటింగ్స్‌ను ఎవరు ఇస్తారు ? అంటే.. అందుకు ఓ సంస్థ పనిచేస్తుంది. దాని పేరు బార్క్‌ (BARC).