అవిశ్వాసం పై...పత్తా లేని పవన్..  

జీవితంలో కొన్ని కీలక నిర్ణయాలకి చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి అలా చేయకపోతే జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది..అయితే ఈ రకమైన విధానం ముఖ్యంగా రాజకీయ నేతల్లో ఎక్కువగా ఉండాలి ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు పరిస్థితులకి తగ్గట్టుగా ప్రజల మనోభావాలకి తగ్గట్టుగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్లిపోవాలి అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు విఫలం అవుతూనే ఉన్నారు..తాజాగా అవిశ్వాసం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ సైలెంట్ అవ్వడం జనసేన వర్గాలని కలవర పెడుతున్న అంశం.

ప్రధానమంత్రి మోడి ప్రభుత్వంపై టిడిపి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును స్పీకర్ వెంటనే అడ్మిట్ చేసుకున్న దగ్గర నుండి ఢిల్లీ కేంద్రంగా ఏపి రాజకీయాలు స్పీడందుకుంది. తాము ఎంత మొత్తుకున్న, ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మాన నోటీసులిచ్చినా పట్టించుకోని స్పీకర్ తాజాగా టిడిపి ఇచ్చిన నోటీసును వెంటనే అడ్మిట్ చేసుకోవటం ఏంటంటూ వైసిపి మాజీ ఎంపిలు మండిపోతున్నారు…ఇదిలాఉంటే బడ్జెట్ సమావేశాల్లో వైపిపి ఎంపిలు 13 సార్లు అవిశ్వాస తీర్మనానికి నోటీసులిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కేంద్రం వైఖరికి నిరసనగా చివరకు వైసిపి ఎంపిలు రాజీనామాలు కూడా చేశారు. ఇపుడు లోక్ సభలో వైసిపి ఎంపిలు లేని విషయాన్ని చంద్రబాబు అవకాశంగా మలుచుకున్నారు.

అయితే ఇంత జరుగుతున్నా సరే పవన్ మాత్రం నోరు కూడ మెదపక పోవడంతో అయోమయంలో పడ్డారు జనసేన నేతలు ఒక పక్క టీడీపీ ,వైసీపీ ఇదే మంచి అవకాశం అంటూ అందిపుచ్చుకోవాలని తహ తహ లాడుతుంటే పవన్ మాత్రం ఎక్కడ ఉన్నాడో కూడా తెలియకుండా సైలెంట్ అయిపోయాడు..టిడిపి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం వెంటనే అడ్మిట్ అయ్యింది. అప్పటి నుండి టిడిపి-బిజెపి కుమ్మక్కు రాజకీయాలంటూ వైసిపి, కాంగ్రెస్, వామపక్షాలు మండిపోతున్నాయి. కానీ బిజెపి-టిడిపి మధ్య తెరవెనుక రాజకీయం ఏదో జరిగిందని అర్దమైపోతోంది అందరికీ. ఇంత జరుగుతున్నా కుమ్మక్కు రాజకీయాలను పవన్ ఎందుకు ప్రశ్నించటం లేదో అంతుబట్టని ప్రశ్నగా మారిపోయింది.

ఏపీలో ప్రస్తత పరిస్థితులపై కనీసం స్పందించలేని బిజీలో పవన్ ఉన్నారా అంటే అసలు రోడ్ షోలలో కూడా లేరు మరి పవన్ ఈ క్కుమ్మక్కు రాజకీయలపై ఎలాంటి స్పందన ఇస్తారు..? మొన్నా, నిన్నటి వరకూ కూడా బిజెపి, టిడిపి అధినేతలను నోటికొచ్చినట్లు విమర్శించిన పవన్ తాజా పరిణామాలపై ఎందుకు మాట్లాడటం లేదన్నది ఎవరికీ అర్ధం కావటం లేదు. రేపే లోక్ సభలో అవిశ్వాసం జరగనుంది కనీసం రేపన్నా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్పందిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది.