నాయకుల వలసబాట ... కాంగ్రెస్ కు ఓ గుణపాఠమా ..?    2018-06-23   02:38:17  IST 

తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికే వర్గ విబేధాలు ముదిరిపోయాయి. ఎవరికి వారే తాము గొప్ప నాయకులం అనుకుంటూ అధిష్టానానికి బెదిరింపులతో కూడిన సంకేతాలు ఇస్తున్నారు. మరో పక్క చుస్తెర్ అధికార పార్టీ టీఆర్ఎస్ చాపకింద నీరులా తమ ప్రాభల్యం బాగా పెంచేసుకుంటోంది. ఈ దశలో ఆ పార్టీ దూకుడుని ఎదుర్కోవాల్సిన కాంగ్రెస్ ఇంకా ఎవరికీ వారే అన్నట్టు ఉండడంతో మిగిలిని కొద్దీ మంది నేతలు కూడా పక్క పార్టీల వైపు చూస్తూ తమ భవిష్యత్తు వెతుక్కుంటున్నారు. తాజాగా దానం నాగేంద‌ర్ పార్టీకి దూర‌మ‌య్యారు.ఆయన పార్టీ మార‌తార‌ని గ‌త‌కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతుంది.ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల న‌గ‌ర అధ్య‌క్షుడిగా ఉన్న ఆయ‌న్ను తొల‌గించి, మాజీ ఎంపీ అంజ‌న్ కుమార్ యాద‌వ్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దీంతో మ‌రింత అస‌హ‌నానికి గురైన దానం పార్టీకి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తుంది.

ఆయ‌న బాట‌లోనే మ‌రోనేత ముఖేష్ గౌడ్ కూడా ఉన్నారట. వీరితోపాటు హైద‌రాబాద్ లో స్థానికంగా మ‌రికొంత‌మంది నేత‌లు వ‌ల‌స‌ల‌కు సిద్ధ‌ప‌డుతున్నారు. దీంతో టి. కాంగ్రెస్ లో ఆందోళన మొదలయ్యింది. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ లో ఏ కొద్దిమంది నేతలు బయటకు వెళ్ళిపోయినా తీరని నష్టంగానే కనిపిస్తోంది. దాన్నుంచి తేరుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌నే ప‌రిస్థ‌తి వచ్చేసింది. నాయ‌కుడి క‌న్నా పార్టీ పెద్ద‌ది కదా! అలాంట‌ప్పుడు, ఒక నాయ‌కుడు వెళ్లిపోయినంత మాత్రాన.. పార్టీ ఎందుకు కుదేలు అవుతోంది అనేదే ప్రశ్నగా మిగిలింది.