భయపెడుతున్న ‘2.ఓ’.. అసలు సినిమా బడ్జెట్‌ ఎంత, బిజినెస్‌ ఎంత..     2018-09-14   10:51:33  IST  Ramesh P

టాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళి ఏ చిత్రం చేసినా కూడా భారీగా ఉంటుంది. ఆయన స్థాయిని అందుకోవడం తెలుగు సినిమా పరిశ్రమలో ఏ దర్శకుడికి సాధ్యం కాదు అనే విషయం తెల్సిందే. ఇక తమిళనాట దర్శకుడు శంకర్‌ అంతకు మించిన భారీ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. శంకర్‌ స్థాయిని అందుకోవడం ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌లో ఏ ఒక్కరికి సాధ్యం కాదు అన్నట్లుగా ‘2.ఓ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

2.o Movie Release Date,Akshay Kumar,Budget Cost Of 2.o Movie,director Shankar,Rajanikanth,What Is The Budget Cost Of 2.o Movie

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ల కలయికలో అమీజాక్సన్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘2.ఓ’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దాదాపు మూడు సంవత్సరాలుగా ప్రేక్షకులు ఈ చిత్రం గురించి ఎదురు చూస్తున్నారు. సంవత్సర కాలంగా అదుగో ఇదుగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. షూటింగ్‌ పూర్తి అయ్యి సంవత్సరం పూర్తి అయినా కూడా ఇంకా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి కాలేదు.

భారీ విజువల్‌ వండర్‌గా రూపొందిన ఈ చిత్రంను దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఒక సౌత్‌ చిత్రం మాత్రమే కాదు ఒక ఇండియన్‌ సినిమా కూడా ఇంత బడ్జెట్‌తో రూపొందలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బడ్జెట్‌ విషయంలో హాలీవుడ్‌ సినిమాలతో పోటీ పడుతున్న ఈ చిత్రం బిజినెస్‌ విషయంలో ఎలా ఉంటుందా అని అంతా అనుకుంటున్నారు. ఇంత బడ్జెట్‌ను రికవరీ చేయడంలో ఈ చిత్రం సక్సెస్‌ అవుతుందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఆ విషయమై ఫిల్మ్‌ మేకర్స్‌ నుండి ఒక లీక్‌ వచ్చింది.

2.o Movie Release Date,Akshay Kumar,Budget Cost Of 2.o Movie,director Shankar,Rajanikanth,What Is The Budget Cost Of 2.o Movie

హిందీ, తమిళం, తెలుగు థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా దాదాపు 400 కోట్ల వరకు వస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఇతర భాషలు, శాటిలైట్‌ రైట్స్‌, ప్రైమ్‌ వీడియో రైట్స్‌ ఇలా అన్ని రైట్స్‌ ద్వారా 300 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. అంటూ 700 కోట్లు సినిమా విడుదలకు ముందే రాబట్టే ఛాన్స్‌ ఉందంటున్నారు. ఇక సినిమా విడుదలై పాజిటివ్‌ టాక్‌ దక్కించుకుంటే సునాయాసంగా వెయ్యి కోట్లను ఈ చిత్రం రాబట్టడం ఖాయం అంటూ టాక్‌ వినిపిస్తుంది.