What happens when you stop eating white rice ?

తెల్లబియ్యం .. మన దేశంలో అత్యధికంగా తినబడే ఆహారం. కొన్ని ప్రదేశాల్లో దీన్ని రోజుకి ఒకటే పూట తింటారు. మరికొన్ని ప్రదేశాల్లో రెండు నుంచి మూడు పూటలు, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తింటారు. మనం వింటూ ఉంటాం, తెల్ల బియ్యంని పాలీష్ చేస్తారని, దాంతో అందులో న్యూట్రింట్స్ తగ్గుతాయని, తెల్లబియ్యం తినడం వలన ఎన్నో నష్టాలు ఉన్నాయని, తెల్లబియ్యం తినడం తగ్గించాలని. కాని ఏం చేసేది .. మిగితా ఏం తిందాం అన్నా ధరలు ఎక్కువ. బియ్యం చవకగా దొరుకుతుంది. దాంతో పాటు కడుపు నింపుతుంది. చాలామంది బియ్యాన్ని వండుకొని తినడానికి కారణం ఇదే. అన్నం అయితే కడుపు నిండినట్టుగా అనిపిస్తుందని. మరి తెల్ల బియ్యం తినడం మానేస్తే ? అలా చేస్తే మీ శరీరంలో జరిగే మార్పులు ఏమిటో చూడండి.

* జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇప్పుడు కరెక్టుగానే ఉంది అని మీరు అనుకుంటున్నారేమో కాని మన జీర్ణవ్యవస్థ ఇంతకంటే మెరుగ్గా పనిచేయాలి. తెల్ల బియ్యంలో ఫైబర్ శాతం పెద్దగా ఉండదు. ఫైబర్ ఉంటేనే జీర్ణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి తెల్లబియ్యం మానేసి ఫైబర్ ఉండే ఆహారపదార్థాలు తింటే బెటర్.