రాశుల బట్టి అనారోగ్యం... ఆశ్చర్యంగా ఉందా.... అయితే ఇది మీ కోసమే     2018-01-30   21:11:35  IST  Raghu V

What Does your Zodiac Sign Say about Your Health

సాధారణంగా ప్రతి ఒక్కరు ఎప్పుడో అప్పుడు అనారోగ్యానికి గురి కావటం సహజమే. అయితే రాశిని బట్టి ఎలాంటి అనారోగ్యానికి గురి అవుతారో తెలుసుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉందా? ఇది నిజం. సాధారణంగా రాశులను బట్టి భవిష్యత్ ని చెప్పుతారు. కానీ ఇప్పుడు రాశిని బట్టి ఎలాంటి అనారోగ్యానికి గురి అవుతారో వివరంగా చూద్దాం.

మేష రాశి
ఈ రాశివారు తలకు సంబందించి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. వీరు దేనినైనా సాధించగలం అనే ధీమాతో ఎక్కువగా రిస్క్ తీసుకుంటూ ఉంటారు. దాంతో అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు.

వృషభ రాశి
వృషభరాశి వారు గొంతు, మెడ, చెవులు, ముక్కు, దంతాలు, వినికిడికి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీరికి ఎప్పుడు జలుబు ఉంటూనే ఉంటుంది. వీరు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే కనుక థైరాయిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మిధున రాశి
ఈ రాశివారు ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థకు సంబందించిన సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరు నోటి పరిశుభ్రత విషయంలో శ్రద్ద పెట్టకపోవడం వలన నోటి దుర్వాసనతో కూడా ఇబ్బంది పడతారు.

కర్కాటక రాశి
ఈ రాశివారు జీర్ణ సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. తరచుగా కడుపునొప్పి వస్తుంది. అలాగే వీరు కోపాన్ని కూడా నియంత్రిచుకోలేరు.

సింహ రాశి
ఈ రాశివారు గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. వీరు ఎక్కువగా ఆందోళన పడటం వలన రక్తపోటు పెరిగి ఆయా వ్యాధులు వస్తాయి. అలాగే వెన్నుముఖకు సంబందిచిన వ్యాధితోనూ బాధపడే అవకాశం ఉంది.


కన్య రాశి
ఈ రాశివారు జీర్ణక్రియ సరిగా లేకపోవటం వలన అనేక ఇబ్బందులను పడుతూ ఉంటారు. దాంతో ఊబకాయ సమస్య కూడా వచ్చేస్తుంది. అలాగే మలబద్దకం సమస్యతో కూడా బాధపడే అవకాశం ఉంది.

తుల రాశి
ఈ రాశివారు కూడా కన్య రాశి వారికీ మాదిరిగానే జీర్ణ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాక సంతానోత్పత్తికి సంబందించిన విషయాల్లో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

వృశ్చిక రాశి
ఈ రాశి వారు జన్యు సంబంధ వ్యాధులు, హార్మోన్ల సమస్యలను ఎదురుకొంటారు. అంతేకాక మధుమేహం బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

ధనుస్సు రాశి
ఈ రాశి వారు కంటి చూపు, తొడలు, తుంటి నొప్పులు, కాలేయానికి సంబందించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అధిక బరువు కూడా వీరికి ప్రధాన సమస్యగా ఉంటుంది.

మకర రాశి
ఈ రాశి వారు ఎముకలకు సంబందించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీరి ఎముకలు కాస్త బలహీనంగా ఉంటాయి. అందువల్ల ఎముకలు బలంగా మారటానికి అవసరమైన ఆహారాలను తీసుకోవాలి.

కుంభ రాశి
ఈ రాశి వారు కీళ్ల నొప్పులకు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక ఆస్తమా బారిన కూడా పడే అవకాశాలు ఉన్నాయి.

మీన రాశి ఈ రాశివారికి నాడీ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండుట వలన తొందరగా వ్యాధుల బారిన పడతారు.