మీరు పుట్టిన నెలను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పే పూలు...ఆశ్చర్యంగా ఉందా     2017-11-10   23:13:31  IST  Raghu V

What Does Your Birth Month Flower Reveal About Your Personality?

మీరు పుట్టిన నెలను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు. జాతకం ఆధారంగా మాత్రం కాదు. ఒక్కో నెలలో పుట్టిన వారికి ఒక్కో పువ్వులో ఉండే లక్షణాలు ఉంటాయి. మరి మీరు ఏ నెలలో జన్మించారో ఆ నెలకు సంబంధించి ఒక పువ్వు పేరును, ఆ లక్షణాలను తెలుసుకుందాం.

జనవరి – కార్నేషన్ ఫ్లవర్

జనవరి నెలలో పుట్టిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కార్నేషన్ పువ్వులలో ప్రేమ,అభిమానం ఉంటాయి. అందువల్ల వీరు తోటి వారిని బాగా అర్ధం చేసుకుంటారు.

ఫిబ్రవరి – వైలెట్

ఈ నెలలో పుట్టిన వారికీ వైలెట్ పువ్వు లక్షణాలు ఉంటాయి. ఫిబ్రవరి నెలలో పుట్టినవారు లాజిక్ గా ఆలోచిస్తారు. వీరి వ్యక్తిత్వం విభిన్నంగా ఉండుట వలన ఎప్పుడు బిజీగా ఉన్నామని చెప్పుతూ ఉంటారు.

మార్చి – డాఫోడిల్

ఏదైనా కొత్త పనిని ప్రారంభించటానికి ఈ పువ్వు సింబాలిక్ గా ఉంటుంది. ఈ నెలలో జన్మించినవారికి నైపుణ్యాలు అధికంగా ఉంటాయి. అలాగే ఇతరుల పట్ల ఆత్మీయత చూపిస్తారు. వీరి మనస్సు సున్నితంగా ఉంటుంది. అలాగే వీరు చేసే పనిలో నమ్మకం ఉండదు.

ఏప్రిల్ – స్వీట్ పీ

ఈ పువ్వు ఆనందానికి సూచికగా ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారు చాలా ఆనందంగా ఉంటారు. వీరు పక్క వారితో కూడా చాలా ఆనందంగా గడుపుతారు. అలాగే ఎక్కువగా ఆశ్చర్యానికి లోను అవుతూ ఉంటారు.

మే – లిల్లీ

ఈ పువ్వు మానవత్వం,స్వచ్ఛత కు ప్రతీకగా ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారు లిల్లీ పువ్వు వలే చాలా స్వచ్ఛంగా ఉంటారు. వీరు ఎక్కువగా తమలో తాము చాలా బాధపడుతూ ఉంటారు. వీరు డిప్రెషన్ కు గురి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

జూన్ – రోజాపూలు

రోజా పువ్వులు అన్ని కాలాలలోనూ దొరుకుతాయి. ఈ నెలలో పుట్టినవారు రోజా పువ్వు వలే మంచి రొమాంటిక్ గా ఉంటారు. వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువ. వీరు అతి సన్నిహితులతోనే ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటారు.