లోకేష్ బాబు కి చంద్రబాబు కళ్ళెం  

ఏపీ సీఎం చంద్రబాబు లోకేష్ ని లోకేష్ చుట్టూ ఉన్న కోటరీని ప్రక్షాళన చేయాలని అనుకుంటున్నారా..? ఆ దిశగా ఇప్పటికే బాబు యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారా అంటే అవుననే చెప్పాలి..అసలు ఎందుకు లోకేష్ విషయంలో చంద్రబాబు ఇంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అంటే లోకేష్ ఈ విషయాలు డీల్ చేయలేకపోతున్నారని ఇప్పటికే బాబు దగ్గర పక్కా రిపోర్ట్ ఉందట దాంతో రంగంలోకి దిగిన బాబు ఒక్కొక్కరిని ఉతికి ఆరేస్తున్నారట..లోకేష్ ని అడ్డం పెట్టుకుని ఆయన పరువుని చెడగొట్టే పని పెట్టుకున్న వారి మొదలు..లోకేష్ మంత్రిత్వశాఖ ని చిన్నా భిన్నం చేసిన అధికారుల వరకూ అందరిని వరుసపెట్టి రేవు పెడుతున్నారట..

అయితే అసలు విషయంలోకి వెళ్తే …మంత్రి హోదాలో పాలానాపరమైన విధానమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో నారా లోకేష్‌ను ఎమ్మెల్సీ..కేంద్ర పార్టీ కార్యాలయ ఇన్‌ఛార్జి జనార్ధన్‌ లోకేష్ పరుని బజారుకి ఈడ్చడమే కాకుండా ఆయన ప్రతిష్టను మంటగలుపుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చింది..అయితే పంచాయితీ పంచాయితీ కార్యదర్శుల నియామకంలో అవుట్ సోర్సింగ్ ద్వారా నియామకాలు చెప్పట్టాలని అనుకోవడం ఎంతో తప్పిదం అయితే పంచాయితీ రాజ్ కార్యదర్శి ఆశాఖాధిపతి, కమీషనర్‌ తప్పుడు సలహాలు విని..అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా పంచాయితీ కార్యదర్శులను నియమించేందుకు నిర్ణయం తీసుకోవడం ఆ ఉత్తరువులు కూడా జారీ చేయడం వలన పెద్ద దుమ్మారం రేగింది.