అరటిపండును ఎక్కువగా తింటున్నారా....అయితే ఇది మీ కోసమే  

అరటిపండును చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అన్ని రకాల పండ్లలో అరటిపండు కాస్త ధర తక్కువగా ఉండుట వలన చాలా మంది అరటిపండు తినటానికి ఆసక్తి చూపుతారు. అరటి పండు తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మనకు తెలిసిన విషయమే. అయితే అరటిపండును ఎక్కువగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా? ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అరటిపండును ఎక్కువగా తినటం వలన మన శరీరం పోషకాలను సరిగా గ్రహించలేదు. మన శరీరంలో అన్ని జీవక్రియలు సరిగా జరగాలంటే పోషకాలు అవసరం. అందువల్ల అరటిపండును మితంగా తినాలి.