రష్మీతో డేటింగ్ చేయాలంటే, ఆ పని చేస్తే సరిపోతుందట     2017-10-05   00:19:01  IST  Raghu V

Watch her movie 5000 times and date Anchor Rashmi

ఏదో సినిమాలో, ఏదో ఫ్రేమ్ లో, ఏదో మూల, ఏదో అలా కనబడే పాత్రల నుంచి తన కెరీర్ మొదలుపెట్టింది రష్మీ. అది కూడా టీనేజ్ లో. సినిమా హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీ కి వస్తే కనీసం క్యారక్టర్ ఆర్టిస్టుగా అయినా గుర్తింపు రాలేదు. టైమ్ పడితే పట్టింది కాని, జబర్దస్త్ అనే ఒకే ఒక్క షోతో రష్మీ దశాదిశా మారిపోయాయి. రాత్రికి రాత్రే స్టార్ యాంకర్ గా ఎదిగిన రష్మీ గౌతమ్ ఆ తరువాత సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టింది కాని, సినిమాల్లో పునరాగమనం కూడా మిశ్రమ ఫలితాల్నే రుచి చూసింది.

కొంత గ్యాప్ తరువాత రష్మీ నటించిన సినిమా నెక్స్ట్ నువ్వే. ఈటివి ప్రభాకర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది. ఇక రష్మీ అప్పుడే ఆ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన డేట్ చేయాలనుకుంటున్న అబ్బాయిలో ఎలాంటి క్వాలిటి కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు సమాధానంగా తన సినిమాని (నెక్స్ట్ నువ్వే) 5000 సార్లు చూస్తే సరిపోతుంది, తాను డేటింగ్ కి రెడీ అనేసింది.

రష్మీ ఇలా అనేసిందో లేదో, అల్రెడి ట్విట్టర్ లో కుర్రాళ్ళు 5000 టికెట్లకి ఎంత ఖర్చు అవుతుంది అంటూ లెక్కలు వేయడం మొదలుపెట్టింది. వారి చేష్టలకు రష్మీ తెగ మురిసిపోతోంది. మరి రష్మీ మొదలుట్టిన ఈ వింత ప్రమోషన్ ఈ సినిమాకి ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.