“ఒక్క సీటు” కోసం “నలుగురు” కుమ్ములాట...“చంద్రబాబు” తీర్పు చెప్పవయ్యా     2018-05-17   22:14:12  IST  Bhanu C

ఏ పోరు ఉన్న పరవాలేదు కానీ ఇంటిపోరు మాత్రం ఉండకూడదు అని పెద్దలు ఊరికే చెప్పలేదు..అనుభం నేర్పిన పాటాలే..పద్యాలుగా..సూక్తులుగా వచ్చాయన్న విషయం మర్చిపోకూడదు సుమీ..సరే అసలు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడికి నిత్యం ఎదో ఒక వ్యవహారం, సమస్యలు ,పనులు ఎదో ఒక విషయంలో సతమతమావుతూనే ఉంటారు..అడుగు తీసి అడుగు పెడితే సమస్యల సుడిగుండాలే..ఒక పక్క వైసీపి వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ..ప్రభుత్వం పనితీరుని పర్యవేక్షిస్తూ ఒకటి కాదు రెండు కాదు గంపెడు సమస్యలని చూసుకునే బాబు కి ఇప్పుడు ఇంటి పోరు అతిపెద్ద సమస్యగా మారింది.

విశాఖపట్నం జిల్లా లోని అనకాపల్లి అంటే టీడీపికి కి కంచుకోట అయితే గత ఎన్నికల్లో అక్కడి నుంచీ పోటీ చేసిన ఎమ్మెల్యే పీలా గోవింద్‌ కి ప్రజలు తిరుగులేని గెలుపుని అందించారు అందుకు తగ్గట్టుగానే ఆయన అనియోజక వర్గ అభివృద్ధి కి ఎంతో కృషిచేస్తూ వచ్చారు..అయితే వచ్చే ఎన్నికల్లో సైతం అక్కడ టీడీపీ నే గెలుస్తుంది అనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆ స్థానం నుంచీ నేను పోటీ చేస్తాను అంటే నేను చేస్తాను అంటూ మరో ఇద్దరు నేతలు ముందుకు వచ్చారు..దాంతో పీలా గోవింద్‌ ఈ సారి కూడా నాకు ఇదే నియోజక వర్గం కావాలి నేను ఎంతో అభివృద్ధి చేసుకున్నాను అంటూ పట్టు బట్టారు..అయితే