War Between BJP and Chandrababu

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌భావం ఇత‌ర రాష్ట్రాల‌పై ఎలా ఉంటుందో తెలీదుగానీ…రెండు తెలుగు రాష్ట్రాల‌పై బాగానే ఉంటుంద‌న్న చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్ర‌భావం తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ మీద పెద్ద‌గా ఉండ‌దు. మ‌హా అయితే అక్క‌డ విప‌క్ష కాంగ్రెస్ ప్లేస్‌లోకి బీజేపీ వ‌స్తుందేమో..అంత‌కు మించి అక్క‌డ చెప్పుకోద‌గ్గ మార్పులేమి ఉండ‌వు. ఇక ఏపీలో అధికార టీడీపీకి మిత్ర‌పక్షంగా ఉన్న బీజేపీ ఇక్క‌డ మాత్రం టీడీపీకి షాక్ ఇచ్చేలా బ‌లం పుంజుకునేందుకు తెర‌వెనక ఎన్నో ఎత్తులు వేస్తోంది.

చంద్ర‌బాబు వెంకయ్య‌, హ‌రిబాబు లాంటి వాళ్ల‌ను ఎంత కంట్రోల్ చేస్తున్నా బీజేపీ వీళ్ల‌ను న‌మ్మ‌కుండా త‌న గేమ్ ప్లాన్ తాను అమ‌లు చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు బీజేపీతో కొన‌సాగించిన స్నేహాన్ని ఇప్పుడు మ‌రింత స్ట్రాంగ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీకి చంద్ర‌బాబు అవ‌స‌రం కంటే…చంద్ర‌బాబుకే బీజేపీ అవ‌స‌రం ఎక్కువ‌….అయితే చంద్ర‌బాబు మాత్రం చాలా తెలివిగా బీజేపీకి త‌న అవ‌స‌ర‌మే ఎక్కువ అన్న‌ట్టు న‌మ్మించారు. అయితే ఫ‌లితాలు వ‌చ్చాక చంద్ర‌బాబుతో బీజేపీకి ప‌నిలేకుండా పోయింది.