మధుమేహం ఉన్నవారు వాల్ నట్స్ తినవచ్చా?     2018-07-02   01:57:06  IST  Lakshmi P

వాల్ నట్స్ తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో ఉండే కీలకమైన పోషకాలు శరీరంలో ఎటువంటి అనారోగ్యం కలగకుండా సహాయపడతాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వాల్ నట్స్ తింటే మధుమేహ రోగులకు కూడా బాగా సహాయపడుతుంది. వాల్ నట్స్ లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్స్,మినరల్స్ సమృద్ధిగా ఉండుట వలన ఎన్నో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సహాయం చేస్తుంది. డైటరీ ఫైబర్ ఉండుట వలన మలబద్దకం వంటి సమస్యలు కూడా దరికి చేరవు.

ముఖ్యంగా వాల్ నట్స్ మధుమేహ రోగులకు చాలా మంచిది. రక్తంలో చక్కర స్థాయిలను స్థిరీకరణ చేయటంలో అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి రోజు గుప్పెడు వాల్ నట్స్ (మూడు స్పూన్లు) తింటే మధుమేహం వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఒకవేళ మధుమేహం ఉన్నవారు తిన్నా మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది.