Vunnadhi Okate Zindagi Movie Review

చిత్రం : ఉన్నది ఒకటే జిందగీ
బ్యానర్ : స్రవంతి సినిమాటిక్స్
దర్శకత్వం : కిషోర్ తిరుమల
నిర్మాత : స్రవంతి రవికిషోర్
సంగీతం : దేవిశ్రీప్రసాద్
విడుదల తేది : అక్టోబర్ 27, 2017
నటీనటులు : రామ్ పోతినేని, లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ తదితరులు

కథలోకి వెళితే :

అభి (రామ్ పోతినేని), వాసు (శ్రీవిష్ణు) చిన్ననాటి నుంచి చెడ్డి దోస్తులు. వీరి స్నేహం రక్తసంబంధం కన్నా, ప్రేమబంధం కన్నా తక్కువ కాదు. అందమైన వీరి స్నేహ జీవితం మహా (అనుపమ) వచ్చిన తరువాత ఒడిదుడుకులని ఎదుర్కుంటుంది. అవేంటో, ఆ సమస్యలని దాటి వీరి స్నేహ బంధం ఎలా నిలబడిందో, ఈ కథలో మేఘన (లావణ్య) తీసుకొచ్చిన మార్పులు ఏమిటో తెర మీదే చూడాలి.

నటీనటుల నటన :

కొంచెం పచ్చిగా మాట్లాడితే, ఓ కమర్షియల్ హీరోగా తప్ప, ఒక నటుడిగా రామ్ ఇంతవరకు తనని తానూ నిరూపించుకోలేదు. అలాంటి సినిమాలు పెద్దగా అటెంప్ట్ చేయలేదు. కాని హైపర్ దెబ్బకి హీరోబలం కంటే కథాబలం ముఖ్యం అని తెలుసుకున్న రామ్, ఇందులో నిజంగా హానెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించాడు. నటించేటప్పుడు పాత్రలా బెహేవ్ చేయడు, నటించెందుకే ప్రయత్నిస్తాడు అని రామ్ మీద మరో కంప్లయింట్ ఉండేది. కాని ఈ సినిమాలో రామ్ గీత దాటలేదు. తనని తను బాగా అదుపు చేసుకొని అభినయించాడు. మరో గొప్ప విషయం ఏమిటంటే, కథ కోసం శ్రీవిష్ణు పాత్ర ఇంపార్టెన్స్ తగ్గించలేదు. ఇక అప్పట్లో ఒకడుండేవాడు తరువాత శ్రీవిష్ణు మరోసారి మంచి పాత్ర దక్కించుకొని, దానికి న్యాయం చేసాడు. అనుపమ ఈ సినిమాకి పెద్ద ప్లస్. ఇక లావణ్య చిన్నిపాటి మైనస్.