2018 వృషభ రాశి వారికి అవమానం ఎక్కువగా ఉంటుందా? మరి రాజపూజ్యం? Devotional Bhakthi Songs Programs    2018-03-16   00:48:33  IST  Raghu V

ఉగాది వస్తుందంటే ప్రతి ఒక్కరు తమ జాతకం ఎలా ఉందో చూసుకోవటానికి ఉత్సాహం చూపుతూ ఉంటారు. జ్యోతిషులు పుట్టిన గ్రహ స్థితి బట్టి వారి జన్మ రాశి అలాగే నక్షత్రం బట్టి జాతకం చెప్పుతూ ఉంటారు. ఈ రోజుల్లో జాతకాలను నమ్మే వారు ఉన్నారు. నమ్మని వారు ఉన్నారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

ఈ రాశి వారికీ ఆదాయం: 11, వ్యయం: 5; రాజపూజ్యం: 1, అవమానం: 3 ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగం అయిన వ్యాపారం అయినా ఈ రాశి వారికీ చాలా అభివృద్ధి ఉంటుంది. కొన్ని ఇబ్బందులు,అడ్డంకులు ఎదురు అయినా దైర్యంగా ఎదుర్కొనే స్వభావం కలిగి ఉంటారు. ఈ సంవత్సరం శని ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

వీరికి అందరిని కలుపుకుపోయే మనస్తత్వం ఉంటుంది. వీరి చర్మ ఛాయ నల్లగా ఉన్నప్పటికీ వీరి మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. వీరు వ్యాపారరంగంలో బాగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం అయితే మంచి లాభాలు వస్తాయి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురు అయినా చాకచక్యంతో బయట పడతారు.