Vodafone offers one hour unlimited 3G/4G for Rs.16

ఇంటర్నెట్ కేఫ్ కి వెళితే గంటకి ఎంత తీసుకుంటాడు? ఎంత లేదన్నా 20-25 రూపాయలు. స్పీడ్ సరిగా ఉండదు. డవున్లోడ్స్ సరిగా చేసుకోలేం. చాలాచోట్ల సిస్టమ్ స్లోగా ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడటం. 16 రూపాయలు ఖర్చుపెట్టండి. గంటసేపు 3G మరియు 4G ఇంటర్నెట్ మీ సొంతం. మీ ఇష్టం ఉన్నంత వాడుకోవచ్చు. ఎన్ని డౌన్లోడ్స్ అయినా పెట్టుకోవచ్చు.

ఈ ఆఫర్ వోడాఫోన్ అందిస్తోంది. మీ మొబైల్ లో జియో సపోర్టు చేయకపోతే, దీనికి మించిన ఆఫర్ దొరకదు. 2G వినియోగదారులు నిరుత్సాహపడవద్దు. కేవలం 5 రూపాయలకి గంటపాటు అన్ లిమిటెడ్ ఆఫర్ మీకోసం తీసుకొచ్చింది వొడాఫోన్.

ఇక కేవలం 7 రూపాయల రిఛార్జ్ తో గంటసేపు అన్ లిమిటెడ్‌ కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ అఫర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జమ్ము & కశ్మీర్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది.