కాపులకు కాలింది ! అందుకే ఆ తీర్మానం     2018-05-16   23:38:50  IST  Bhanu C

కర్ణాటక ఎన్నికల హడావుడి అయిపోయింది… కానీ అక్కడి వ్యూహాలు, సమీకరణాలు అన్ని ఇప్పుడు ఏపీ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి అక్కడి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఏపీలో ప్రధాన సామజిక వర్గం అయిన కాపుల్లో ఇప్పుడు రాజకీయ వెనుకబాటుతనం అనే ఫీలింగ్ మొదలయ్యింది.

కర్నాటక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కాపుల్లో రాజకీయ చైతన్యం పెరిగినట్టు కనిపిస్తోంది. ఇక నుంచి కాపులకు ఒక ప్రత్యేక పార్టీ ఉంటుందని.. మా కులం ఓట్లతో గెలిచే పార్టీకి.. మా కాపునేతే అధ్యక్షుడిగా ఉంటాడని బెజవాడ కాపు తీర్మానం చేసుకున్నట్టు తెలుస్తోంది.

కాపు సామాజిక వర్గంలో. ఇటీవల కుల, వర్గ, మత పరంగా జరుగుతున్న రాజకీయ విద్వేషాలు, తెర వెనుక కుట్రలు, తెరపై ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా జరుగుతున్న మాటలు, మంత్రాలు ఇప్పుడు కాపు గుండెలను రగిలిస్తున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక పార్టీకి ఓట్లు వేసి.. ఆ తర్వాత వారి దయాదాక్షిణ్యాలపై ఉండాల్సి వస్తోందని కాపుల్లో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. దానికి బెజవాడ తీర్మానమే ఒక ఉదాహరణగా కనిపిస్తోంది.