కేసీఆర్ కి బెజవాడ దుర్గగుడిలోకి నో ఎంట్రీ..కారణం ఇదే

బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం ఎదురు చేస్తున్న కేసీఆర్ ఆశలు తీరేలా లేవు..కేసీఆర్ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో బెజవాడ దుర్గమ్మని దర్శించుకోవాలని అనుకున్నారు కానీ ఎక్కడ ఏమి జరిగిందో ఆయన పర్యటన ఆగిపోయింది..కేసీఆర్ అడిగిన రెండు తేదీలలో మేము ఆయనకి దర్శనం ఏర్పాట్లు చేయలేము అని చేతులు ఎత్తేశారు దుర్గగుడి అధికారులు.

అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలా నక్షత్రం చాలా చాలా మంచి రోజు..ఆరోజు అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలు అన్నీ పోతాయి అని భక్తుల భావన..అదేవిధంగా కేసీఆర్ కూడా ఇదే మూల నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవాలని అనుకున్నారు.అదే రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు సైతం రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉండటంతో ఏపీ సీఎం కార్యాలయానికి సమాచారం అందించారు. కేసీఆర్ మూల నక్షత్రం రోజు…లేకుంటే విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకుంటారని తెలంగాణ సీఎం కార్యాలయం నుంచి అందిన సమాచారాన్ని అందించారు.