ఆ ఏపీ మంత్రి మాతో టచ్ లో ఉన్నారు..విజయసాయి షాకింగ్ కామెంట్స్     2018-05-23   22:51:47  IST  Bhanu C

వైసీపి ఎంపీ విజయసాయి ఈ మధ్య సంచలనాలకి కేంద్రం బిందువు అవుతున్నారు..ఎవరో ఒకరిపై విమర్శలు చేస్తూ తన ఉనికిని చాటుకుంటున్నారు..అయితే ఎప్పుడు చంద్రబాబు లోకేష్ లపై ,టీడీపీ పార్టీ పై విమర్శలు చేసే విజయసాయి ఒక్కసారిగా తన ట్రాక్ మార్చారు..అస్తమానం చంద్రబాబు బాబు లపై వ్యాఖ్యలు చేస్తే మొదటికే మోసం వస్తుందనుకున్న ఈ వైసీపి నేత ఈసారి ఏపీ ప్రభుత్వ మంత్రుల్ని టార్గెట్ చేశారు..వివరాలలోకి వెళ్తే..

విజయసాయి ఏపీ మంత్రి గంటా పై విరుచుకు పడ్డారు..విశాఖలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..గంతటాని గోడమీది పిల్లి అని సంభోధించారు..గంటా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరతారని ఇప్పుడున్న పార్టీలో రేపటి వరకు ఉంటారో లేదో కూడా గ్యారెంటీ ఇవ్వలేమని అన్నారు..గతంలో ఎన్నో పార్టీలు దూకిన గంటా…ఇప్పుడు వైసీపీలో చేరేందుకు కూడా సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పి పెద్ద బాంబే పేల్చారు