కడప ఉక్కుపై గాలి దుమారం.. ఢిల్లీ కి విజయసాయి.    2018-06-30   00:04:52  IST 

కడప లో తెలుగుదేశం ఎంపీ చేస్తున్న ఉక్కు దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది..అలాంటిలాంటి పాపులారిటీ కాదూ..కేంద్ర మంత్రి సీఎం రమేష్ కి కాల్ చేసి మరీ దీక్షని విరమించమని చెప్పారట దాంతో టీడీపీ ప్రభుత్వం దీక్షని ఇంకా పతాకస్థాయికి తీసుకువెళ్ళింది అయితే ఈ దీక్ష ఇలా జరుగుతుండగానే వైసీపి కీలక నేత విజయసాయి రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్ళారు..అలా వెళ్ళిన ఆయన అక్కడ నిర్మలా సీతారామన్ ను కలిసి, ఎక్స్‌అప్రెంటిస్‌ ఉద్యోగుల సమస్యలు చెప్పారు అంటూ సాక్షి పత్రికలో వచ్చింది ఆ విషయాన్ని ఎంతో ఫోకస్ చేశారు కూడా అయితే ఈ చిన్న విషయంపై ఢిల్లీ వెళ్ళాలా అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి..అయితే విజయసాయి రెడ్డి ఢిల్లీ పర్యటన వెనుక పెద్ద మతలబే ఉంది అంటున్నారు..

అయితే ఇంత తొందరగా ఢిల్లీ వెళ్లి మరీ ఆయన గారు ఏమి చేశారు అంటే గాలి జనార్ధనరెడ్డి కి లాబీయింగ్ చేయడానికి వెళ్ళాడు అంటూ ఊహాగానాలు వస్తునాయిఇంత అర్జెంటుగా ఢిల్లీ వెళ్లి, చేసేది ఏంటి అంటే, గాలి జనార్ధన్ రెడ్డికి లాబీయింగ్ అనే వార్తలు వస్తున్నాయి..దీనికోసం పెద్ద స్కెచ్ వేశారట..సీఎం రమేష్ దీక్షతో హడాలిపోయిన కేంద్రం రమేష్ ఆరోగ్యం గురించి వాకబు చేస్తూనే మరో పక్క ఉక్కుపై ఎదో ఒక నిర్ణయం తీసుకోవలని డిసైడ్ అయ్యారట.ఈ నేపధ్యంలో, కడప ఉక్కు పరిశ్రమ గాలికి కట్టబెట్టేలా, విజయసాయి లాబీయింగ్ చేస్తున్నారని తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది..