గ్రేట్‌.. విజయ్‌ చేసినట్లుగా మరెవ్వరు చేయరు     2018-06-18   23:56:24  IST  Raghu V

‘పెళ్లి చూపులు’ చిత్రంతో ఒక క్లాసీ సక్సెస్‌ను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ, అర్జున్‌ రెడ్డి చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయ్యాడు. రికార్డు స్థాయిలో అర్జున్‌ రెడ్డి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం విజయ్‌ దేవరకొండకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇదే సమయంలో అర్జున్‌ రెడ్డిలో ఈయన నటనకు గాను ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు దక్కింది. విజయ్‌ దేవరకొండ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు వచ్చిన ఆనందంలో మునిగి పోయాడు. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ వంటి స్టార్స్‌ బెస్ట్‌ హీరో నామినేషన్స్‌లో ఉన్నప్పటికి కూడా విజయ్‌ దేవరకొండ వారిని పక్కకు నెట్టి అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఏ హీరోకు అయినా కూడా అవార్డు రావడం జీవితంలోనే సంతోషకర విషయం. విజయ్‌ దేవరకొండ కూడా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు రావడంతో జీవితంలోనే సంతోషకర క్షణాలను అనుభవించాడు, అనుభవిస్తూనే ఉన్నాడు. విజయ్‌కు దక్కిన అవార్డుల్లో ఇదే ప్రముఖమైన అవార్డుగా చెప్పుకోవచ్చు. తన మొదటి అవార్డును ఏ హీరో అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు. కాని విజయ్‌ దేవరకొండ మాత్రం తన అవార్డును వేలం వేసేందుకు సిద్దం అయినట్లుగా ప్రకటించాడు. డబ్బుల కోసం తాను అర్జున్‌ రెడ్డి ద్వారా దక్కించుకున్న ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డును వేలం వేయబోతున్నట్లుగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు.