ఆ 25 మంది హీరోయిన్స్‌ కుళ్లుకుని ఏడుస్తున్నారేమో?     2018-08-16   09:16:11  IST  Sainath G

విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యాడు. పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి చిత్రాతో స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకోవడంతో పాటు, యూత్‌లో ప్రస్తుతం యమ క్రేజ్‌ ఉన్న హీరోగా విజయ్‌ దేవరకొండకు పేరు వచ్చింది. అతి తక్కువ సమయంలో ఇంతటి స్టార్‌డంను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ తాజాగా ‘గీత గోవిందం’ చిత్రంతో మరోసారి తన స్టార్‌డంను పెంచేసుకున్నాడు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా విజయ్‌ దేవరకొండ గోవిందంగా అలరించాడు.

తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టిన ఈ చిత్రం మరో మైలు రాయి చిత్రంగా విజయ్‌కు నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ చిత్రాన్ని ‘అర్జున్‌ రెడ్డి’కి ముందు విజయ్‌ దేవరకొండతో చేయాలని పరుశురామ్‌ భావించాడు. అయితే హీరోయిన్‌ సెట్‌ అవ్వక పోవడంతో అర్జున్‌ రెడ్డి ముందు తెరకెక్కింది.

Geetha Govindam Film,Rashmika Mandanna,Vijay Devarakonda

అర్జున్‌ రెడ్డి షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే విజయ్‌ దేవరకొండ కోసం దాదాపు 25 మంది హీరోయిన్స్‌తో సంప్రదించడం జరిగింది. సినిమాలో హీరోయిన్‌ పాత్రకు నోటెడ్‌ హీరోయిన్‌ అయితే బాగుంటుందని భావించి, కాస్త స్టార్‌డం ఉన్న హీరోయిన్స్‌తో మాట్లాడటం జరిగింది. కాని దాదాపు అందరు హీరోయిన్స్‌ కూడా విజయ్‌తో నటించేందుకు నో చెప్పారు. స్టార్‌డం లేని హీరోతో సినిమా చేయడం వల్ల ఉపయోగం ఉండదని వారు భావించి ఉంటారు.

తాజాగా ‘గీత గోవిందం’ విడుదలై భారీ సక్సెస్‌ను దక్కించుకుంది. సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందనకు మంచి గుర్తింపు దక్కింది. నటన మరియు గ్లామర్‌ షోకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో రష్మిక స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఆ పాత్రను వద్దనుకున్న వారు, ఆ సినిమాకు నో చెప్పిన వారు ఇప్పుడు అయ్యో అని ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు. మంచి సినిమాను వదులుకున్నాం అనుకుని చింతిస్తున్న వారు ఉంటారు. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.