నువ్వు రేపో మాపో అట్ల చెయ్యి...అప్పుడు వేస్కుంటరు నిన్ను.. రష్మిక కు విజయ్ లైవ్ లో కౌంటర్.!     2018-08-19   09:44:09  IST  Sainath G

విజయ్ దేవరకొండ, రష్మిక మందాన జంటగా నటించిన “గీత గోవిందం” సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సినిమా హిట్ అంటున్నారు ఆడియన్స్ అంతా. సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు అందిస్తున్నారు. అర్జున్ రెడ్డి హిట్ తో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ కాతాలో మరో హిట్ పడింది. ఇక క్యూట్ బ్యూటీ “రష్మిక” విషయానికి వస్తే…”చలో” తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యి కుర్రాళ్ళ హృదయాలను దోచుకుంది. ఇప్పుడు గీత గోవిందంతో మరోసారి ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

Live Counter,Vijay Devarakonda

విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.25 కోట్లకుపైగా వసూలు చేసి విజయ్ దేవరకొండ కెరియర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ చిత్రంతో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు గీత గోవిందం పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మికలు. విజయ దేవరకొండ ఎప్పటిలాగే గోవిందం పాత్రలో పరకాయ ప్రవేశం చేయగా.. గీత పాత్రలో ప్రేక్షకుల మదిని దోచింది కన్నడ బ్యూటీ రష్మికా.

ఈ సినిమా ఇంటర్వ్యూలో రశ్మిక తను చేసిన పాత్రల గురించి మాట్లాడారు. బలమైన పాత్ర అయితేనే చేస్తాను నాలుగు పాటలకి వచ్చి వెళ్లిపోయే రోల్స్ అయితే చేయను అని చెప్పింది. తరవాత నువ్వు అలంటి రోల్ చేయాల్సి వస్తే చేయవా.? అప్పుడు వేస్కుంటరు నిన్ను అని కౌంటర్ ఇచ్చాడు విజయ్.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://youtu.be/oGqp2TEjBZU