హిందువులు విగ్రహారాధనను ఎందుకు నమ్ముతారు? Devotional Bhakthi Songs Programs  

ఇంటిలో విగ్రహారాధన
ఇతర మతాలలో వలే కాకుండా హిందువులు విగ్రహారాదన చేస్తారు. దేవుని అవతారంగా విగ్రహాలను పూజిస్తారు. ఇంటిలో ప్రత్యేకంగా ఒక దేవుడి గదిని ఏర్పాటు చేసి, అక్కడ విగ్రహాలను పెట్టి భక్తితో పూజలు చేస్తారు.

హిందువులు విగ్రహారాధనను ఎందుకు నమ్ముతారు?
దేవుడు వారి జీవితాల్లో అంతులేని బలం మరియు శక్తిని ఇస్తాడని నమ్మకం. అలాగే సమస్యల నుండి బయట పడటానికి సహాయం మరియు చెడు చేయకుండా మనస్సులో భయాన్ని కలిగిస్తారు.

శాస్త్రాలు ఏమి చెప్పుతున్నాయి?
హిందు మతంలో శాస్త్రాలు ప్రతి ఇంటిలో దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలని మరియు విగ్రహాలకు నియమంగా పూజలు చేయకపోతే వ్యతిరేక ప్రభావాలు వస్తాయని చెప్పుతున్నాయి.

పూజ గది ప్రత్యేకంగా ఉండాలి
బెడ్ రూంతో కలిపి పూజ గది ఉండకూడదు. ఎందుకంటే దేవుని ముందు ఎటువంటి లైంగిక చర్యలకు పాల్పడకూడదు. అందువల్ల పూజ గది ఎప్పుడు ప్రత్యేకంగా ఉండాలి. అలాగే పూజ గది తూర్పు ముఖంగా ఉంటే మంచిది.