ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ భార్య పాత్ర లో టాప్ హీరోయిన్, ఆమె ఎవరో తెలుసా...     2018-06-10   00:11:16  IST  Raghu V

ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఎన్టీఆర్ బయోపిక్ సినిమా దర్శకులు క్రిష్ చేతిలోకి వచ్చింది.ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ గారి పాత్ర ఎలాగ ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బ‌స‌వ‌తారకం రోల్ ఎవ‌రు పోషిస్తారు? అన్న‌దానిపై స‌స్సెన్స్ కొన‌సాగుతోంది. .ఈ నేప‌థ్యంలో ఆ ఛాన్స్ బాల‌య్య ఎవ‌రికిస్తారు? అన్న దానిపై గ‌త నెల రోజులుగా ఒకటే చ‌ర్చ‌. తాజాగా ఆ రోల్ కు తెర‌ప‌డింది. విద్యాబాల‌న్ ను క్రిష్ ఎంపిక చేసిన‌ట్లు రైట‌ర్ల బృందం ద్వారా తెలిసింది. ఆ పాత్ర‌కు న్యాయం చేయ‌గ‌ల నటి ఆమె ఒక్క‌ర్తేన‌ని భావించి క్రిష్ తుది నిర్ణ‌యం తీసుకుని విద్య‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. విద్య‌ను సంప్రదించి ఆ క్యారెక్ట‌ర్ గురించి చెప్ప‌గానే ఆమె కూడా వెంట‌నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని తెలుస్తుంది.

జాతీయ అవార్డ్ గెలుచుకున్న నటి

బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి , నేషనల్ అవార్డ్ ని కూడా సొంతం చేసుకుంది విద్యాబాలన్ ఆమె మంచి కథలను ఎంచుకుంటూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. కహాని.. డర్టీపిక్చర్.. తుమ్హారీ సులు వంటి సినిమాలు ఆమె ప్రతిభకు అద్దం పడతాయి. బోల్డ్ పాత్ర‌ల్లోనూ త‌న మార్క్ చాటింది.