Venkatesh Wants to Remake Tamil Movie Salim

తన కెరీర్‌లో ఎన్నో సినిమాలను రీమేక్‌ చేసి, విజయాలను దక్కించుకున్న స్టార్‌ హీరో వెంకటేష్‌. ఈయన ఇటీవల నటించిన ‘దృశ్యం’ మరియు ‘గోపాల గోపాల’ సినిమాలు కూడా రీమేక్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రెండు సినిమాలు కూడా మంచి ఫలితాన్ని సాధించాయి. రీమేక్‌ చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో త్వరలో మరో రీమేక్‌ చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తమిళంలో ఆ మద్య వచ్చిన ‘సలీం’ చిత్రం వెంకీ ఆసక్తి చూపుతున్నాడని, ఆ సినిమా వెంకటేష్‌కు బాగా సూట్‌ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తమిళ ‘సలీం’ సినిమాను ఇప్పటికే నిర్మాత సురేష్‌ కొండేటి డబ్బింగ్‌ చేసే పనిలో ఉన్నాడు. ‘సలీం’ సినిమాను ప్యాన్సీ రేటుకు డబ్బింగ్‌ రైట్స్‌ చెల్లించి మరీ దక్కించుకున్న సురేష్‌ కొండేటి త్వరలోనే ‘డా॥ సలీం’గా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించాడు. వెంకటేష్‌కు ఈ సినిమా నచ్చడంతో సురేష్‌ కొండేటితో నిర్మాత సురేష్‌బాబు రీమేక్‌ కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. సురేష్‌ కొండేటికి ఎంతో కొంత ముట్టజెప్పి రీమేక్‌ రైట్స్‌ను దక్కించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. తమిళంలో విజయ్‌ అంథోని చేసిన పాత్రను తెలుగులో వెంకటేష్‌ చేయబోతున్నాడు. ఇటీవలే వెంకటేష్‌ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు దశరధ్‌కు ఓకే చెప్పాడని ప్రచారం జరిగింది. ఆ సినిమా తర్వాత సలీం చేస్తాడేమో చూడాలి.