వెంకీ మూడవ మల్టీస్టారర్‌..!     2018-06-29   04:46:46  IST  Bhanu C

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో మలితరం మల్టీస్టారర్‌కు ఆజ్యం పోసిన హీరో వెంకటేష్‌. ఆ చిత్రంలో తన పాత్ర పరిధి తక్కువ ఉండి, ప్రాముఖ్యత తక్కువ ఉన్నా కూడా మల్టీస్టారర్‌ చిత్రాలు రావాలనే ఉద్దేశ్యంతో వెంకటేష్‌ ఇమేజ్‌ను పక్కన పెట్టి పెద్దోడి పాత్రను చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సంవత్సరంకు ఒకటి రెండు లేదా అంతకంటే ఎక్కువ చిన్నా, పెద్ద మల్టీస్టారర్‌ చిత్రాలు వస్తూనే ఉన్నాయి. ఆ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితోనే ఇంకా పలు మల్టీస్టారర్‌ చిత్రాలకు రంగం సిద్దం అవుతుంది. ఆ సినిమా వల్లే ఎంతో మంది హీరోలు మల్టీస్టారర్‌ చిత్రాలు చేయాలనే ఉద్దేశ్యంకు వచ్చారు.

వెంకటేష్‌ వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పటికే మహేష్‌బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, రామ్‌తో కలిసి ‘మసాలా’ చిత్రాలను చేసిన వెంకటేష్‌ ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌తో కలిసి ‘ఎఫ్‌ 2’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక నాగచైతన్యతో ఒక మల్టీస్టారర్‌కు రంగం సిద్దం అయ్యింది. బాబీ దర్శకత్వంలో మామ అల్లుడు మల్టీస్టారర్‌కు రంగం సిద్దం అవుతుంది. పల్లెటూరు నేపథ్యంలో మామ అల్లుడుల కథాంశంతో ఈ చిత్రంను తెరకెక్కించబోతున్నారు. సురేష్‌బాబు ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతతో కలిసి నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఆ చిత్రం తర్వాత మరో మల్టీస్టారర్‌కు వెంకీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.