ఈ కూరగాయలను పచ్చిగా తింటే ఏమి జరుగుతుందో తెలుసా?     2018-06-14   23:01:37  IST  Lakshmi P

సాధారణంగా కూరగాయలను తింటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే మనం చాలా కూరగాయలను ఉడికించి తింటాం. అయితే కొన్ని కూరగాయలను పచ్చిగానే తింటాం. అయితే కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా తినకూడదు. ఉడికించి మాత్రమే తినాలి. ఒకవేళ పచ్చిగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల పచ్చి కూరగాయలు ఏమి తినకూడదో వివరంగా తెలుసుకుందాం.

క్యాలీఫ్లవర్

క్యాలీఫ్లవర్ ని పచ్చిగా తినకూడదు. ఉడికించుకొని మాత్రమే తినాలి. పచ్చిగా తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. అలాగే దీనిలో లభించే పోషకాలు ఉడికిస్తే ఎక్కువగా శరీరానికి అందుతాయి.

మొలకెత్తిన విత్తనాలు

ఈ రోజుల్లో చాలా మంది మొలకెత్తిన గింజలను పచ్చిగానే తింటున్నారు. ఆలా తినటం వలన వాటిలో ఉండే రసాయనాలు జీర్ణ సంబంధ సమస్యలు వచ్చేలా ప్రేరేపిస్తాయి. అందువల్ల ఉడికించి తింటేనే మంచిది.