అబ్బా.. ఏం ప్లాన్ వేశావమ్మా సరస్వతి! అసలు విషయం తెలిస్తే ఆమె ముఖం మీద ఉమ్మేస్తారు     2018-07-18   10:50:20  IST  Sainath G

సొసైటీలో భర్తలను ఎంత క్రూరంగా చంపడం అనే కాంపిటీషన్ ఏమన్నా నడుస్తుందా.. ఇంత సీరియస్ టాపిక్ ని సిల్లీగా స్టార్ట్ చేసినందుకు సారీ..కానీ..ఏంటండీ ఇది మొన్న స్వాతి..తర్వాత జ్యోతి,శ్రీవిద్య,ఇప్పుడు సరస్వతి..ఒకరి తర్వాతగా ఒకరు తమ ప్రేమని దక్కించుకోవడం కోసం భర్తలను మట్టుపెట్టడం…పెళ్లై పదిరోజులు కాకుండానే భర్తని చంపించింది చాలక..అది కప్పిపుచ్చుకోవడానికి ఒక పెద్ద కథ అల్లడం ..నిజంగా సినిమాలు చూసి మనుషులు చెడిపోతున్నారా.. మనుషుల్ని చూసి సినిమాలు తీస్తున్నారా..ఇది అర్దంకాని పెద్ద సబ్జెక్ట్..ఇప్పుడు విషయం ఏంటంటే ఇష్టం లేని పెళ్లి చేసారనే కారణంతో భర్తని చంపిన సరస్వతి కథ..

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీశంకరావుతో ఏప్రిల్ 28న వివాహమైంది.శంకరరావు ఇంజినీరింగ్‌ పూర్తిచేసి కర్ణాటకలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు.పెళ్లైన పదిరోజులకు అంటే మే 7 వ తేదీన గౌరి బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు పార్వతీపురం వచ్చారు. పనిలో పనిగా బంగారు దుకాణంలో నగలకు సంబంధించిన లావాదేవీలు చూసుకొని రాత్రి ఎనిమిదింటి తర్వాత స్వస్థలం చిట్టపులివలసకు బయల్దేరారు..మార్గంమధ్యలో టాయిలెట్ వస్తుందని బండి ఆపమని సరస్వతి అడగడంతో బండి ఆపాడు గౌరి..టాయిలెట్ కి సరస్వతి పక్కకి వెళ్లగానే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు గౌరిపై దాడి చేశారు,కాసేపటికి అక్కడికి వచ్చిన సరస్వతి దగ్గర నగలు బెదిరించి పట్టుకుపోయారు..ఇది అందరికి తెలిసిన కథ..

Saraswathi,Srikakulam,Veeraghattam

వాస్తవం ఏంటంటే సరస్వతికి పెళ్లికి ముందే శివ అనే వ్యక్తిని ప్రేమించింది.పెద్దలు ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతో తనే దగ్గరుండి భర్తను హత్య చేయించాలనే ప్లాన్ వేసింది..అందులో భాగంగాలనే ప్రియుడు శివ,శివ ఫ్రెండ్ వైజాగ్ కి చెందిన రౌడీ షీటర్ గోపితో కలిసి భర్తను హత్య చేయించింది.బంగారు నగలు దొంగతనం చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా,వారు చెప్తున్న దానికి,సరస్వతి చెప్పిన దానికి పొంతన కుదరకపోవడంతో..ఈ హత్యలో సరస్వతికి ఏమన్నా భాగం ఉందా అనే యాంగిల్లో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటికి వచ్చింది..

అయ్యో పెళ్లై పది రోజులు కాలేదు భర్త ని పోగొట్టుకుంది అని బాదపడిన వారే ఇప్పుడు ఎంత కుట్ర పన్నింది అంటూ సరస్వతిని తిట్టుకుంటున్నారు..ఇలాంటి ఘటనలు జరుగిన ప్రతిసారి భర్తల్ని చంపేంత ధైర్యం ఉన్నప్పుడు,తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పేంత ధైర్యం ఎందుకు ఉండట్లేదనే ప్రశ్న తలెత్తుతుంది.వీటికి సమాధానం దొరికేదెన్నడో…