టీడీపీ “కంచుకోట” లో వైసీపీ జెండా...“చంద్రబాబు కి భారీ షాక్”    2018-04-06   06:18:30  IST  Bhanu C

ఎన్నికలు దెగ్గర పడుతున్న సమయంలో సహజంగానే ఒక పార్టీ నుంచీ మరొక పార్టీలోకి చేరికలు ఉంటాయి..అయితే తమ తమ పార్టీలకి కంచుకోటలు గా ఉన్న స్థానాలలో సైతం పార్టీల మార్పులు జరుగుతూ ఉండటం..అందులోను అధికార పక్షానికి చెందిన పార్టీలలో నేతలే ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళాలని అనుకోవడం ఎటువంటి సూచనకి నిదర్సనమో అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఏపీలో ఇదే పరిస్థితి నెలకొంది..అధికార టిడిపి పార్టీకి ఘలక్ ఇచ్చి ప్రతిపక్ష వైసీపి పార్టీలోకి వెళ్ళడానికి టిడిపి కంచుకోటనే బద్దలు కొట్టుకుని వస్తున్నారు..టిడిపి పార్టీలోని కీలక నేతలు.వివరాలలోకి వెళ్తే

జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రజల మన్ననలు అందుకుంటూ ముందుకు సాగుతోంది అయితే ప్రస్తుతం గుంటూరులో జగన్ పాదయాత్ర జరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ కీలక నేతలు తీవ్రమైన చర్చలు జరుపుతున్నారు.. చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే గుంటూరులో పలువురు కీలక నేతలు వైసీపీలో చేరారు.తాజాగా ఏపీ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్ వైసీపీలో చేరనున్నారు…దీనికి గాను గత కొంతకాలంగా వైసీపి కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు..త్వరలోనే జగన్ పాదయాత్ర సమయంలోనే జగన్ సమక్షంలో వైసీపి తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది

ఇదిలాఉంటే..కృష్ణ ప్రసాద్ నందిగామలో 1999 పోటీ చేసి ఓటమి పాలయ్యారు…ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో గుంటూరు-2 స్థానం నుంచి ఆయనను రంగంలోకి దించాలని టీడీపీ భావించినప్పటికీ… కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో టికెట్ ఇవ్వడం కుదరలేదు అయితే ఆ సమయంలో నందిగామా నియోజకవర్గం భాద్యతలు ఆయనకు అప్పగించారు…తంగిరాల గెలుపుకోసం ఎంతో కృషిచేసిన ఆయన..తరువాత తంగిరాల దీంతో తంగిరాల గెలుపుకు ఆయన కృషి చేశారు. తంగిరాల మరణించిన తర్వాత ఉప ఎన్నిక నుంచి ఆయనను దూరంగా ఉంచారు…అయితే మెల్లమెల్లగా కృష్ణ ప్రసాద్ ప్రాభల్యం తగ్గుతూ వచ్చింది..టిడిపి అధినాయకత్వం కూడా కృష్ణ ప్రసాద్ ని పూర్తిగా పక్కన పెట్టడంతో..ఇప్పుడు కృష్ణ ప్రసాద్ జగన్ పార్టీలోకి జంప్ చేయడానికి సిద్దంగా ఉన్నారు..త్వరలోనే ఆయన తన అనుచరులతో వైసీపి కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది..