చంద్రబాబుకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వర్మ     2017-10-18   05:34:49  IST  Bhanu C

varma shcoking comments on chandrababu naidu

వివాదాలు లేకపోతె సినిమానే మొదలుపెట్టడు వర్మ..తన ప్రతీ సినిమాకి ఎదో ఒక రంగు పులుముతాడు..వర్మ ఇప్పుడు చేపడుతున్న ప్రాజెక్ట్ లక్ష్మీస్ ఎన్టీఆర్ బయో పిక్..ఎంత దుమారం రేపుతోందో అందరు చేస్తూనే ఉన్నారు….మంత్రుల దగ్గర నుంచీ..ఎమ్మెల్యేల వరకు వర్మకి కౌంటర్ మీద కౌంటర్ వేస్తుంటే వాటినే వర్మ తన ప్రచారం కోసం వాదేసుకుంటూ చాలా ఘాటుగా ఆన్సర్స్ ఇస్తున్నాడు..వర్మ ఇచ్చే రిప్లై లకి..అటువైపు నుంచీ మరొక మాటకూడా మాట్లాడటం లేదు..ఈ మొత్తం వ్యవహారంలో వర్మ సినిమాకి బాగా ప్రచారం కూడా బాగానే వచ్చింది.

ఇది ఇలా ఉంటే వర్మ చేసే పుబ్లిసిటీ స్టంట్ తెలుసుకున్న చంద్రబాబు నాయుడు వర్మ చేసే కామెంట్స్ కి మీరు ఎవ్వరు స్పందించకండి అంటూనే తానే వర్మని కామెంట్ చేశారు..వర్మ కూడా ఏమి తక్కువ తినలేదు కదా సో బాబు కాంటర్ కి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశాడు.ఇంతకీ చంద్రబాబు నాయడు ఈ సినిమా విషయంలో ఏమన్నారంటే..లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అని కామెంట్ చేశారు.

దీనికి వర్మ కూడాచంద్రబాబుని కౌంటర్ చేస్తూ ‘సీబీఎన్ గారన్నట్టు ఎన్టీఆర్ జీవితం తెరచిన పుస్తకమే.. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో నేను ఆ పుస్తకంలోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలని తిరిగి అతికించబోతున్నాను’ అంటూ కౌంటర్ వేశారు.వర్మ చేసిన ఈ కామెంట్ తెలుగు దేశం నేతల్లో తీవ్ర ఆగ్రహాని కలిగిస్తోంది .ఏకంగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తూ వర్మ చేసిన కామెంట్స్ పై వారు తెగ మధనపడి పోతున్నారు..మరి వర్మ కామెంట్స్ కి తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి