జగన్ కి షాక్ ఇచ్చి జనసేన లోకి..రాధా    2017-10-25   06:16:48  IST 

వైసీపి అధినేత ఒంటెద్దు పోకడ వలన..జనసేన లో నాయకుల్ని ఒక్కొక్కరిగా కోల్పోతున్నారు..ఇప్పటివరకు పార్టీని వీడి వెళ్ళిన వాళ్ళు సైతం ఇదే కారణం చెప్పడంతో ఈ విషయం నిజమో కాదో సంగతి పక్కన పెడితే జగన్ కి మటుకు పార్టీలో నియంత అనే పేరు వచ్చేసింది.అసలే పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది..అధికార టిడీపి వేగంగా పావులు కదుపుతూ ఉంటే.ఇటు జగన్ మాత్రం తన మూర్ఖత్వం తో అందరికి దూరం అవుతున్నారు..తాజాగా జరుగుతున్నా పరిణామాలు ఇందుకు నిదర్సనం అవుతున్నాయి.

అసలే విజయవాడ లో వైసీపి బలం లేదు..ఎప్పటినుంచో విజయవాడ లో జగన్ పాగా వేయాలని చూస్తున్నారు..ఈ సమయంలో వంగవీటి రాధా లాంటి వాళ్ళని దూరం చేసుకుంటే పార్టీ పార్టీ పరిస్థితి ఏమిటి అని నేతలు తలలు పట్టుకుంటున్నారు. విషయమేమిటంటే.. తన నియోజ‌క‌వ‌ర్గంలో ఓ డివిజ‌న్ అధ్య‌క్షుడి ఎంపిక‌లో కూడా రాధా నియ‌మించిన వ్య‌క్తిని..కాదని జగన్ వేరొక వ్యక్తిని అక్కడ ఇంచార్జ్ గా నియమించారట.దీంతో రాధ అనుచరులు తీవ్ర నిరాసకి గురవుతున్నారని తెలుస్తోంది.. తీవ్ర మనస్తాపం తో ఉన్న రాధా పార్టీని వీడే యోచనలో ఉన్నారట. ఈ విషయంలో ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందో అని రాధా నేరుగా జ‌గ‌న్ వ‌ద్దే ప్ర‌స్తావించ‌గా తాను నియ‌మించిన వ్య‌క్తిని మైనార్టీల్లో మంచి ప‌ట్టుఉంద‌ని,అందుకే అత‌డిని డివిజ‌న్ అధ్య‌క్షుడిగా నియ‌మించాన‌ని జ‌గ‌న్ చెప్ప‌డం రాధాని చాలా భాదించిందట.

రాధా కి రోజు రోజు కి పార్టీలో ప్రయారిటీ తగ్గించడం..విజయవాడ పరిధిలో పార్టీ పరంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే రాధా వరకు వేల్లకపోవడంతో..నిరాస చెందుతున్న రాధా..జనసేన వైపు చేస్తున్నారట. అందులోనూ ఒకే సామాజికవర్గం..పవన్ తో ప్రజారాజ్యం నుంచీ సన్నిహిత సంభందాలు ఉండటంతో..రాధా అటువైపుగా వెళ్ళే అవకాసం ఉందని తెలుస్తోంది.రాధా వైసిపిని వీడటం అధికారికంగా ప్రకటించకపోయినా..జగన్ ప్రవర్తనతో రాధా ఇబ్బంది పడుతూ కొనసాగడం కష్టంగానే కనిపిస్తోందని..జనసేన లోకి వెళ్ళడం ఖాయం అని రాధా సన్నిహితులు చెప్తున్నారు. ఒక వేళ రాధా వైసీపిని వీడితే విజయవాడ లో జగన్ కి ఇది గట్టి దెబ్బగానే చెప్పవచ్చు.