ఛీఛీ.. నన్ను చెప్పుతో కొట్టాలి     2018-05-10   01:55:17  IST  Raghu V

అల్లు అర్జున్‌ హీరోగా ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత వక్కంతం వంశీ తెరకెక్కించాడు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన వక్కంతం వంశీ ఆకట్టుకోలేక పోయాడు. తనపై అల్లు అర్జున్‌ పెట్టిన నమ్మకంను వమ్ము చేశాడు. రచయితలు పలువురు స్టార్‌ దర్శకులుగా మారారు. అదే దారిలో ఈయన కూడా స్టార్‌ అవుతాడని అంతా ఊహించుకున్నారు. కాని నా పేరు సూర్య చిత్రంను ఆశించిన రేంజ్‌లో రూపొందించడంలో విఫలం అయ్యాడు. ఈయనతో వర్క్‌ చేయాలనుకున్న స్టార్స్‌ ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు.

ఇక సినిమా ఫలితం విషయం పక్కన పెడితే ఈ చిత్రంలో చాలా లాజిక్‌లు మిస్‌ అయ్యాయి. కొన్ని కమర్షియల్‌ సినిమాలకు కామెడీ సినిమాలకు ప్రేక్షకులు లాజిక్స్‌ పట్టించుకోరు. కాని ఇదో సీరియస్‌, స్టార్‌ హీరో సినిమా. కనుక ప్రతి ఒక్క లాజిక్‌ సరిగా ఉండేలా దర్శకుడు కథను సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ చిన్నతనంలో ఇంట్లోంచి పారిపోతాడు. కొన్నాళ్ల తర్వాత ఒక సంతకం కోసం తండ్రి వద్దకు వస్తాడు. తండ్రి గుర్తు పట్టినప్పటికి అల్లు అర్జున్‌ను తల్లి గుర్తు పట్టదు. చిన్నప్పటి నుండి కూడా కంటిపై ఒక గాటు ఉంటుంది. ఆ గాటును చూసి అయినా తల్లి గుర్తు పట్టాలి కదా అంటూ కొందరు ఎద్దేవ చేస్తున్నారు.