Vaani viswanath shocking comments on YS jagan

సినీనటి వాణీ విశ్వనాథ్ టిడిపిలోకి వస్తున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. వైసీపి ఫైర్ బ్రాండ్ రోజాకి ధీటుగా వాణీ విశ్వనాథ్ ని రంగం లోకి దింపుతున్నారు టిడిపి అధిష్టానం..ఇప్పటికే ఆమె రోజా మీద అనేక కామెంట్స్ చేసింది. రోజానా అసలు తన గురించి ఆలోచించడం లేదు..తానూ నాకు అసలు పోటీనే కాదు అనే మీడియాముందు అన్నది కూడా. అంతేకాదు అధిష్టానం ఆదేశిస్తే ఇక్కడకి రోజా మీద పోటీ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని కూడా చెప్పేసింది.

ఇదిలా ఉంటే..జగన్ పాదయాత్ర చేయడం చాలా హాస్యాస్పదం అని చంద్రబాబు అన్నారు..ఏపీలో ప్రతిపక్షం అనేది ఉన్నా లేనట్టుగానే ఉంది అని చెప్పారు. జగన్ కి అధికార దాహం నరనరాల్లో ఉండిపోయిందని అందుకే ప్రజలని మోసం చేయడానికి..కట్టు కదలు చెప్పడానికి పాదయాత్రలు చేస్తున్నాడని తెలిపారు. ప్రజలు 1100 కి డయల్ చేసి మీ భాదలు తెలుపవచ్చు అని ఇప్పటి నుంచీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని తెలిపారు.

అయితే వాణీ విశ్వనాథ్ జగన్ పాదయాత్రపై తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. జగన్ తన పాపాలు కడిగేసుకోవడానికి పాదయాత్రలు చేస్తున్నాడని…జగన్ మోకాళ్ళ యాత్రలు చేసినా సరే తన పాపాలు పోవని ఎద్దేవా చేశారు.జగన్ చేసే పాదయాత్రలు మరో నాలుగు చేసినా సరే జగన్ ని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు.ఏపీ ప్రజలు చంద్రబాబు పాలనలో సుఖంగా చూస్తూ తట్టుకునే మనసు జగన్ కి లేదని. ప్రతిపక్ష నాయకుడిగా తానూ పూర్తిగా విఫలం అయ్యాడని తెలిపారు. జగన్ ని తన పార్టీలో ఉంటున్న ఎమ్మెల్యేలే నమ్మడం లేదని ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారు అంటూ వాణీ విశ్వనాద్ జగన్ పై ఫైర్ అయ్యారు.