వంటగది శుభ్రంగా ఉండాలంటే బెస్ట్ చిట్కాలు     2018-05-15   01:10:35  IST  Lakshmi P

మనం ప్రతి రోజు వంట చేసే వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. వంట పూర్తి అయిన వెంటనే వంటగదిని శుభ్రం చేయాలి. కూరగాయాల తుక్కును ఎప్పటికప్పుడు బయట పాడేస్తూ ఉండాలి. వంటగది,స్టవ్,మైక్రో ఒవేన్ వంటి వాటిని నిమ్మరసం,బేకింగ్ సోడా వంటి వాటితో శుభ్రం చేస్తే జిడ్డు,మురికి తొలగిపోయి శుభ్రంగా ఉంటాయి.

వంట చేసే సమయంలో గ్యాస్ స్టవ్ మీద ఏవో ఒకటి పడుతూనే ఉంటాయి. వాటిని తుడవకపోతే మొండి మరకలుగా మారిపోతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు స్టవ్ ని శుభ్రం చేయాలి. మైక్రో వేవ్ వాడిన వెంటనే శుభ్రం చేసుకోవాలి. లేకపోతె మైక్రో వేవ్ లో వండిన ఆహార పదార్ధాల వాసన అలానే ఉండిపోతుంది. మైక్రో వేవ్ ని శుభ్రం చేయటానికి మెత్తని క్లాత్,బేకింగ్ సోడా ఉపయోగించాలి.