ఈ ఒక్క బాటిల్ ని రోజు కొద్దిగా తాగితే, 15 రోగాలు మీ దరికి రావు     2018-05-16   02:46:53  IST  Lakshmi P

ఇక దీని కంపోజిషన్ విషయానికొస్తే, ప్రతి 100 ml కి, 5.48 కాలరీలు, 1.37 mg కార్బోహైడ్రేట్లు, 99.97 mg పొటాషియం, 25.10 mg సోడియం, 5.08 mg కాల్షియం మరియు 12.39 mg ఫాస్ ఫరస్ ఉంటుంది ‌.

దీన్ని ఎలా తయారు చేస్తారు అంటే, అపిల్ పండ్లు, షుగర్‌ మరియు బ్యాక్టీరియా కలిపి. Fermentation (మద్యం తయారు చేసే పద్దతి) ప్రాసెస్ లోనే దీన్ని తయారుచేస్తారు‌. మొదట షుగర్ ని అల్కాహాల్ గా మార్చి, ఆ తరువాత ఆ ఆల్కహాల్ ని వెనిగర్ గా మారుస్తారు. సింపుల్ గా చెప్పాలంటే, ఆపిల్ పండ్లతో చేసిన వైన్ అన్నమాట. కాని ఇందులో ఆల్కహాల్ ఉండదు. Acetic acid మరియు malic acid వలన రుచి తియ్యగా ఉండదు. దీని గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా? మరి దీన్ని రోజు తాగితే శరీరానికి ఎన్ని రకాలుగా మేలో చూడండి.

* డయాబెటిస్ పెషెంట్లు రోజుకు రెండు టీ స్పూన్ల వెనిగర్ సగం గ్లాసు నీళ్ళలో కలిపి తాగితే బ్లడ్ షుగర్ లెవల్స్ మెల్లిగా పడిపోతుంటాయి. ఇది నిజంగానే నిజం.

* సహజంగానే అన్నిరకాల వెనిగర్ లలో అసెటిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ వెనుక 2001 భారి ఎత్తున బ్రిటన్ లో జరిగిన ఒక రిసెర్చి సాక్ష్యం.

* జ్వరం, జలుబు లేదా దగ్గు లాంటి ఇంఫెక్షన్లు వచ్చినప్పుడు మన శరీరంలోని pH లెవల్స్ పడిపోతాయి. అందుకే కోలుకోవడానికి కూడా సమయం పడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ pH బ్యాలెన్స్ ని తిరిగి తీసుకువచ్చి, ఇంఫెక్షన్స్ ని తగ్గిస్తుంది.

* మన రక్తంలో పేరుకుపోయి ఉండే టాక్సిన్స్ ని, మెటల్స్ ని కూడా బయటకి తీస్తుంది ఇది. దీన్ని ఇన్నర్ క్లీన్సర్ అని అందుకే అంటారు.