ఈ ఒక్క బాటిల్ ని రోజు కొద్దిగా తాగితే, 15 రోగాలు మీ దరికి రావు     2018-05-16   02:46:53  IST  Lakshmi P

సర్వరోగ నివారిణి అనే పేరుతో మార్కెట్‌లో చాలా మందులు దొరుకుతాయి. అవి డాక్టర్లు అప్రూవ్ చేసినవా, అసలు ఏ కంపెనీ తయారుచేస్తోంది, ఆ కంపెని మందులని కనీసం ఆర్ ఎమ్ పి డాక్టర్స్ అయినా రికమెండ్ చేస్తున్నారా లేదా, ఇవేమి పట్టించుకోకుండా కొనేస్తుంటారు జనాలు. అసలు ఈ సర్వరోగ నివారిణి అంటే ఏంటి? ఆ మందు కంపోజిషన్ ఏంటి? ఏ ఆసిడ్ ఎంత పరిమాణంలో ఉంటుంది? ఏ మినరల్ ఎక్కువగా వాడారు? ఇలాంటి విషయాల గురించి ఒక్క నిమిషం అయినా ఆలోచిస్తారా అంటే లేదనే చెప్పాలి. మరి ఇంతటి అజ్ఞానం, అలసత్వం ఎందుకు మనకు?

ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే ముందుని సర్వరోగ నివారిణి అనలేమి కాని, ఎంత కదాన్నా 15-20 సమస్యల నుంచి మీ శరీరాన్ని కాపాడుతుంది ఇది‌. దాని పేరే ఆపిల్ సైడర్ వెనిగర్. పేరు అల్రెడి వినే ఉంటారు‌. ఏమిటి ఇది? ఎలా తాయారుచేస్తారు? వేటితో తయారుచేస్తారు? మనకి అనుకూలమైన ధరలోనే లభ్యం అవుతుందా? చెప్తాం, అన్ని చెప్తాం.

ముందుగా ధర గురించి మాట్లాడుకుంటే, రూ. 350 నుంచి మొదలు నాణ్యత గల ఆపిల్ సైడర్ వెనిగర్ బాటిల్స్ దొరుకుతాయి. రూ.1000 – రూ.2000 మధ్యలో కూడా ధరలు ఉంటాయి. అందులో తక్కువ ధరలో నాణ్యతని అందిస్తున్నవారు Apollo Pharmacy వారు. 500 ml బాటిల్ ని కేవలం రూ.360 కే అమ్ముతున్నారు. ఇక్కడ ధర మాత్రమే కాదు, ఈ బాటిల్ ని సజెస్ట్ చేయడానికి మరో కారణం Apollo brand. జనాలకి తెలిసిన మందుల కంపెనీ కదా. కొనడానికి ముందు సంకోచించాల్సిన పని లేదు.