కళ్యాణ్ రామ్ భార్య గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా.? ఆమె ఎవరి కూతురంటే.?     2018-06-05   01:02:24  IST  Raghu V

కళ్యాణ్ రామ్…నందమూరి ఫామిలీ నుండి వచ్చిన హీరో. ఒక సినిమా హిట్ అయితే…ఒక సినిమా ఫట్ అంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. దాంతో రెట్టింపు పట్టుదలతో సరికొత్త కథలను ఎంచుకొని నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా కస్టపడి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. టాలివుడ్ లో కళ్యాణ్ రామ్ ప్రయోగాలు చేయటానికి సిద్ధంగా ఉంటాడు.

ఇక అసలు కథ ఏంటి అంటే కళ్యాణ్ రామ్ వివాహం స్వాతితో 2006 ఆగస్టు 10 న చాలా వైభవంగా జరిగింది. సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన స్వాతి ఒక డాక్టర్. కళ్యాణ్ రామ్ కు ఎటువంటి ఎఫైర్స్ లేవు. కళ్యాణ్ రామ్ పెళ్ళిచూపుల్లో స్వాతిని చూసి ఈమె నా భార్య అని ఫిక్స్ అయిపోయాడట. అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడని కళ్యాణ్ రామ్ ని భార్య స్వాతి చాలానే మార్చింది. ఈ విషయాన్నీ కళ్యాణ్ రామ్ చాలా సందర్భాలలో చెప్పాడు.