మిస్ ఇండియా పోటీలో రన్నర్ అప్ గా నిలిచిన తెలుగు అమ్మాయి గురించి ఆసక్తికర విషయాలు ఇవే.!     2018-06-27   00:22:52  IST  Raghu V

తమిళనాడుకు చెందిన అనుకృతి‌వాస్ ఫెమినా మిస్ ఇండియా- 2018 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తం 29 మంది ఫైనలిస్టులను వెనక్కినెట్టి, ఆమె ఈ ఘనత దక్కించుకున్నారు. ముంబైలో జరిగిన ఎఫ్‌బీబీ కలర్స్ మిస్ ఇండియా-2018 కార్యక్రమంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్… ఫెమినా మిస్ ఇండియా- 2018 కిరీటాన్ని అనుకృతివాస్‌కు ధరింపజేశారు. ఈ అందాల పోటీలో హర్యానాకు చెందిన మీనాక్షీ చౌదరి ఫస్ట్ రన్నరప్‌గా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రేయ సెకెండ్ రన్నరప్ గా నిలిచారు. అనుకృతి క్రీడాకారిణిగా, డాన్సర్‌గా పేరొందారు. ఫ్రెంచ్ భాషలో బీఏ పూర్తి చేశారు.

రన్నర్ అప్ గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రేయా రావు కామవరపు(23) గురించి అసకథికార విషయాలు మనం తెలుసుకుందాము. ఆర్కిటెక్చర్ అయిన శ్రేయా.. ఓ స్నేహితురాలు పట్టుబట్టడంతో అడిషన్స్‌కు వెళ్లి మరీ ఈ అదృష్టాన్ని అందుకున్నారంట. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం అందాల పోటీలనగానే ముందు భయపడ్డారని ఆమె చెబుతున్నారు.