క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన "రవిప్రకాష్" గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా.?

డాక్టర్ అవ్వబోయి ఆక్టర్ అయ్యా అని చాలా మంది సినిమా ఆర్టిస్టులు అంటుంటారు. అదేకోవకి చెందారు మన తెలుగు సినిమా నటుడు ఒకరు,. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రల్లో నటించిన ఆ నటుడు డాక్టర్ అవ్వబోయి ఆక్టర్ అయ్యారంట. ఇప్పటివరకు దాదాపు 200 చిత్రాల్లో నటించారు ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అతను ఎవరా అనుకుంటున్నారా.? మీకోసం క్లూ…అతడు సినిమాలో ప్రకాష్ రాజ్ పక్కనే ఉంటాడు. అతనే మన రవిప్రకాష్ గారు.

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్థానిక మీడియాతో కొంతసేపు మాట్లాడారు. విశాఖ మా సొంత ఊరని, లాసెన్స్‌బే కాలనీలో మా తల్లిదండ్రులు ఉంటున్నారని తెలిపారు. విద్యాభ్యాసం అంతా విశాలో జరిగిందన్నారు. విశాఖ వేలీ స్కూల్‌లో పన్నెండో తరగతి వరకు చదివానని, ఆ తర్వాత ఎంబీబీఎస్‌ మాస్కోలో చేశానని తెలిపారు. కొంతకాలం హైదరాబాద్‌లో ప్రాక్టిస్‌ చేశానన్నారు. ఆ తర్వాత స్నేహితులు, బంధువులు చెబితే అనుకోకుండానే సినీ రంగ ప్రవేశం చేశానన్నారు.