యాంకర్ అనసూయ గురించి చాలామందికి తెలియని విషయాలివే.! ఫామిలీ బాక్గ్రౌండ్ ఏంటంటే.?  

ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో నాగ వంటి కొన్ని చిత్రాల్లో జూనియర్ ఆర్టిస్టుగా దర్శనమిచ్చింది. కానీ మొదట్లో ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి యాంకర్ గా ఎంతో పేరు తెచ్చుకుంది. జబర్దస్త్ తో ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆమె అందచందాలు, వాక్చాతుర్యం జబర్దస్త్ షోకు ప్లస్ అయ్యాయి. ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయనా, క్షణం, గాయత్రి, వంటి సినిమాలతో టాలీవుడ్ లోనూ తన ముద్ర వేసింది. ఇక రీసెంట్ గా వచ్చిన రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఆ సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయింది అనసూయ.

కాలేజ్ డేస్ లో ఎన్ సీసీ లో పరిచయం అయిన సుషాంక్ భరద్వాజ్ తో ప్రేమలో పడిన అనసూయ అతడినే పెళ్లి చేసుకుంది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్న ఈ యాంకర్ భామకు శౌర్య, అయాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. అనసూయ భర్త సుశాంక్ ఓ ఇన్వెస్ట్ మెంట్ ప్లానర్. ప్రస్తుతం అనసూయకు సినిమాల్లో చాన్సులు బాగానే వస్తున్నా తనకు ఇంత లైఫ్ ఇచ్చిన టెలివిజన్ రంగాన్ని మాత్రం వదులుకోనని చెబుతోంది.