యాంకర్ అనసూయ గురించి చాలామందికి తెలియని విషయాలివే.! ఫామిలీ బాక్గ్రౌండ్ ఏంటంటే.?     2018-06-13   04:16:11  IST  Raghu V

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ కి గ్లామర్ సొగసులద్ది టాప్ పొజిషన్లో కొనసాగుతున్న యాంకర్ అనసూయ. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ దూసుకెళుతున్న అనసూయ అటు వెండితెర మీద కూడా సరైన అవకాశాలనే అందిపుచ్చుకుంటుంది.సుకుమార్ ,రాంచరణ్ కాంభినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమలో రంగమ్మ అత్తగా నటించి ఆడియన్స్ తో శబాష్ అనిపించుకుంది. అయితే ఆమె ఫామిలీ బాక్గ్రౌండ్ గురించి చాలా మందికి తెలీదు. అతని భర్త కొన్ని సార్లు టీవీలో కనిపించారు కానీ తల్లితండ్రులు మాత్రం ఎప్పుడు కనిపించలేదు.

ఆమె స్వస్థలం నల్గొండ జిల్లా పోచంపల్లి. పక్కా తెలంగాణ అమ్మాయి. తండ్రి సుదర్శన్ రావు ఓ వ్యాపారవేత్త. ఆయన తన కుమార్తెకు తన తల్లి అనసూయ పేరు పెట్టుకున్నారు. ఇంట్లో ఎప్పుడూ మిలిటరీ డిసిప్లిన్ మెయింటైన్ చేసేవారు. అనసూయను కూడా ఆర్మీలోకి పంపించాలనుకున్నారట. అయితే బద్రుకా కాలేజ్ నుంచి 2008లో ఎంబీఏ పట్టా అందుకున్న తర్వాత ఐడీబీఐ బ్యాంక్ లో పనిచేసింది. అక్కడ కొన్నాళ్లపాటు విధులు నిర్వర్తించిన తర్వాత ఓ ప్రయివేట్ కంపెనీలో హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ లో చేరింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే సాక్షి టీవీలో యాంకర్లు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేసింది. అయినా మనకెందుకు వస్తుందిలే అనుకుంటున్న తరుణంలో ఆశ్చర్యకరంగా అనసూయను ఎంపిక చేశారు సాక్షి టీవీ మేనేజ్ మెంట్ పెద్దలు. అయితే ఆమెకు న్యూస్ రీడర్ జాబ్ నచ్చకపోవడంతో కొన్నాళ్లు ఇంటికే పరిమితమైంది.