రావణ బ్రహ్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?     2018-05-13   05:13:04  IST  Raghu V

రావణాసురుడు అంటే అందరికి రాక్షసుడు, సీతాదేవిని అపహరించాడని మాత్రమే తెలుసు. రావణాసురుడు అందరిని హింసిస్తాడని మనకు తెలుసు. అయితే మనకు తెలియని ఎన్నో లక్షణాలు రావణాసురుడులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాల ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

రావణాసురుడుకి పది తలలు ఉంటాయి. శివ భక్తుడు. స‌క‌ల శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, విద్యలను అభ్యసించిన తెలివైనవాడు రావణుడు.

జైన రామాయణం ప్రకారం చూస్తే సీత రావణాసురుడికి కూతురు అవుతుందట.

రావ‌ణాసురుడు తన సొంత మేథాశ‌క్తితో పుష్పక విమానాన్ని త‌యారు చేశాడ‌ట‌. శాస్త్ర, విజ్ఞాన రంగాల్లో అత‌ను ఆరితేరి ఉండ‌డం వ‌ల్లే పుష్పక విమానాన్ని రావణాసురుడు త‌యారు చేశాడ‌ని చెబుతారు.

రావణాసురుడికి అలంకరణ పట్ల చాలా అభిరుచులు ఉన్నాయట. స్త్రీల కన్నా బాగా అలంకరణ చేసుకొనేవారట.