మామిడి ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు    2018-05-04   00:38:27  IST  Lakshmi P

వేసవికాలం వచ్చిందంటే మామిడి పండ్లు అధికంగా వస్తాయి. అంతేకాక మామిడి పండ్లను తినటానికి కూడా అందరు ఆసక్తి కనబరుస్తారు. మామిడిపండు ఎంత రుచిగా ఉంటుందో అదే స్థాయిలో పోషకాలు కూడా ఉంటాయి. మామిడి పండులో విటమిన్ ఎ, బి, సిల‌తోపాటు పొటాషియం, కాప‌ర్‌, మెగ్నిషియం, ఫ్లేవ‌నాయిడ్స్‌, సాపోనిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్స్ సమృద్ధిగా ఉండుట వలన మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అలాగే మామిడి ఆకులలో ఎన్నో ఆరోగ్య సమస్యలను పరిస్కారం చేసుకోవచ్చు. మీకు ఆశ్చర్యం కలుగుతుంది కదా. కానీ ఇది నిజం. ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.,

అయితే మామిడి ఆకులను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. కొన్ని మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించి టీ డికాషన్ గా తయారుచేసుకోవాలి. ఈ టీ డికాషన్ ని రెగ్యులర్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.