సిగరేట్, మద్యం మాత్రమే కాదు .. ఈ అలవాట్లు కూడా కిడ్నిలకు ప్రమాదం     2018-04-07   22:57:48  IST  Lakshmi P

కిడ్నీలు ఒక్కసారిగా చెడిపోవు. అవి చెడిపోవాలంటే, వాటికి హాని చేసే అలవాటు ఉండాల్సిందే. అలవాటు, వ్యసనం .. ఈ పదాలు వింటే మనకి మొదట సిగరేట్ లేదా మద్యం గుర్తుకువస్తాయి. కిడ్నీలకు హాని చేసే అలవాట్లే ఇవి. కాని ఇవి మాత్రమే కారణం కావు. అందుకే ధూమపానం, మద్యపానం అలవాట్లు లేనివారికి కూడా కిడ్నీల్లో సమస్యలు వస్తాయి. ఎందుకంటే, కిడ్నిలను పాడు చేసే అలవాట్లు ఇంకా ఉన్నాయి కాబట్టి. ఈ అలవాట్లు మనకి అంతగా ప్రమాదకరంగా అనిపించకపోవచ్చు కాని, ఇవి సైలెంట్ గా చేయాల్సిన హాని చేసేస్తాయి. మరి అవేంటో చూడండి.

ఏదో పనిలో ఉన్నారు. ఇంతలో మూత్రం వస్తున్నట్లు అనిపించింది. అప్పుడు చాలామంది మూత్ర విసర్జన చేయకుండా, దాన్ని ఆపి ఉంచుతారు. ఇక తట్టుకోవడం కష్టం అని అనిపించేదాకా అపి, అప్పుడు విసర్జన చేస్తారు. ఇది చాలా చెడ్డ అలవాటు. దీన్ని వలన మలినాలు వెనక్కిపోవచ్చు, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడవచ్చు.

Unexpected habits that damage your kidneys


పచ్చిగా చెప్పాలంటే, కిడ్నీలు మనం తాగే నీటిమీద, ఇతర ద్రవపదార్థాల మీద ఆధారపడి ఉంటాయి. మనం నీళ్ళు బాగా తాగితే తప్ప టాక్సిన్స్ బయటకిపోవు. టాక్సిన్స్ బయటకిపోతే తప్ప, కిడ్నిలు శుభ్రంగా ఉండవు. కొందరు మంచినీళ్ళు సరిగా తాగరు. ఇది కూడా ఒక బ్యాడ్ హాబిట్. మీ కిడ్నీలను అనేక సమస్యలకు గురిచేస్తుంది ఈ అలవాటు.