ఈ సమస్యలతో ఉన్నవారు బొప్పాయి తినకూడదు .. ప్రమాదం

పల్లెటూరిలో ఉండాలే కాని, బొప్పాయి మార్కెట్ లో కన్నా మన పెరట్లోనే ఎక్కువ దర్శనం ఇస్తుంది. ఇది చాలా లాభదాయకమైన ఫలం. విటమిన్ సి గుణాలు బాగా కలిగిన బొప్పాయి మంచి మోతాదులో యాంటి ఆక్సిడెంట్స్, న్యూట్రింట్స్, విటమిన్స్ కలిగి ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీని ఆకులు జ్వరాల్ని నయం చేయడానికి వాడతారు. కాని ఇంత మంచి ఫలాన్ని కొందరు తినకూడదు తెలుసా ? ఆ కొందరు ఎవరు ? ఎలాంటి కండీషన్స్ లో బొప్పాయి తినకూడదో చూడండి.

* ఆస్తమ, హే ఫీవర్, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ఫలానికి దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే బొప్పాయిలో పపైన్ అనే ఎంజీం ఉంటుంది. ఇది శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఎలర్జీ లాంటిది. సమస్యలు ఇంకా పెంచుతుంది.

* బొప్పాయి అధికంగా తింటే అది వీర్యకణాలపై చెడు ప్రభావం చూపవచ్చు అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇప్పటికే వీర్య సంబంధిత సమస్యలు ఉన్నాయనుకొండి … బొప్పాయి తగ్గించడం పక్కన పెడితే, మీరు నయం అయ్యేదాకా దీన్ని ముట్టకపోవడం మంచిది.