సిలికా జెల్ సంచుల వలన కలిగే ఉపయోగాలు  

సిలికా జెల్ సంచులను మనం తరచుగా షూ బాక్సులలో చూస్తూ ఉంటాం. వాటిని పూర్తిగా పనికిరాని మరియు విషపూరితమైనవని చెత్త బుట్టలో పడేస్తాం.

నిజానికి వాటిలో విషం ఉండదు. ఈ సంచులలో సిలికాన్ డయాక్సైడ్ అనే పదార్ధం ఉంటుంది. ఇది మనకు ఇంటిలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఆ ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

1. జిమ్ బ్యాగ్ లో ఉంచాలి
అదనపు తేమను గ్రహించటం ఈ సంచుల యొక్క ముఖ్య ఉపయోగం. బాక్టీరియా ఎక్కువగా,తడి మరియు తేమ వాతావరణాలలో వృద్ది చెందుతుంది. అందువల్ల ఇవి జిమ్ బ్యాగ్,ల నుండి నెమ్ము మరియు క్రిములను తొలగించటానికి సహాయపడతాయి. దాంతో జిమ్,బ్యాగ్ లు దుర్వాసన రాకుండా ఉంటాయి.

2. టవల్స్ మధ్య ఉంచాలి
టవల్స్ ఉన్న కేబినేట్ లో సిలికా సంచులను పెడితే తడి మరియు చెత్త వాసనలు,అన్ని పోతాయి.